ఒక వ్యక్తి గొప్పగా సమాజం కోసం ఏదైనా చేస్తున్నాడు లేదా 24 గంటలు ఏదో ఒక పని కోసం శ్రమిస్తున్నాడు అంటే అతని వెనుక త్యాగం చేసేవారు ఎందరో ఉన్నారని అర్థం.సినిమా ఇండస్ట్రీలో లేదా రాజకీయాల్లో ఉండేవారు చాలా మంది 24 గంటలు బిజీగానే ఉంటారు.
వారికి ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో, ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో ముందస్తు ప్రణాళికలు లేకుండానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి వారి జీవితం ఎల్లప్పుడూ ఎంతో గజిబిజిగా ఉంటుంది.మరి ఇంతటి బిజీ షెడ్యూల్లో ఉండే వ్యక్తుల యొక్క భాగస్వాములు ఎలా ఉంటారు అంటే కుటుంబం కోసం వారి సమయాన్ని మాత్రమే కేటాయించాల్సి వస్తుంది.
భర్త బయట పనుల్లో బిజీగా ఉంటే భార్య ఎల్లప్పుడూ పిల్లల బాధ్యతను, కుటుంబ బాధ్యతను భుజాన మోయాల్సి వస్తుంది.
ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం( SP Balasubramanyam ) మరియు అతని భార్య సావిత్రి( SP Savithri ) కూడా అతీతం ఏమీ కాదు.సింగర్ గా ఎస్పీ బాలు చాలా ఏళ్ల పాటు బిజీగానే ఉన్నారు.ఆయన కరోనా సోకి చివర శ్వాస విడిచే వరకు కూడా ఏదో ఒక రికార్డింగ్ లేదా ఏదో ఒక ప్రోగ్రాం తో సమయాన్ని గడుపుతూ ఉండేవారు.
అయితే బాలసుబ్రమణ్యం ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సావిత్రి మాత్రం కుటుంబం కోసం ఎంతో త్యాగం చేసిందని చెప్పాలి.బాలుని సావిత్రమ్మ పెళ్లి చేసుకునే వరకు ఆమె వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే.
ఈ ముగ్గురు చెల్లెల్లు ఒక తమ్ముడు ఉన్నారు అందరూ టీనేజ్ లోనే ఉండేవారు.కెరీర్ లేదా చదువుల కోసం అందరూ బాలు మద్రాసులో ఉంటే అక్కడే ఉండేవారు.
అలా బాలు తోబుట్టువులు నలుగురిని అలాగే వారి పిల్లలు చరణ్ మరియు పల్లవిలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది పొద్దున లేచింది మొదలు భర్తకు పిల్లలకు ఏం కావాలి, మరిదిని రెడీ చేసి బాక్సులు కట్టి స్కూలుకు పంపడం అందరిని జీవితాలను సెటిల్ చేయడం ఆ తర్వాత వారి పెళ్లిళ్లు, పేరంటాలు, ఇంట్లో ఫంక్షన్లు అన్నీ కూడా సావిత్రి దగ్గర ఉండి చూసుకుంది.ఇలా తన జీవితం మొత్తం కూడా ఎంతో కష్టంగానే గడిపింది.కానీ బాలు పై ఇష్టంతో అన్ని ఎంతో ఓర్పుతో, సహనంతో చేసుకుంటూ వచ్చింది.ఈరోజు మన మధ్యలో ఎస్పీ బాలసుబ్రమణ్యం లేకపోయినా ఆయన రూపంలో ఆయన చేసిన పనులు సినిమాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి కానీ ఇలా కనిపించని ఎన్నో త్యాగాలు వారి వెనుక ఉంటాయి.
వారిని కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది
.