C. R. Subbaraman: దక్షిణాది సినీ సంగీతంలో గ్లామర్ కింగ్.. మహిళ చేతిలో హత్యకు గురయ్యాడా?

దక్షిణ భారత చలనచిత్ర రంగంలో మ్యూజిక్ కంపోజర్, నిర్మాత C.R.సుబ్బరామన్( C.R.Subbaraman ) బాగా పేరు తెచ్చుకున్నారు.ఇతడి అసలు పేరు చింతామణి రామ సుబ్బరామన్.

 Facts About Music Composer C R Subbaraman-TeluguStop.com

చిన్నతనం నుంచే సంగీతం అంటే మక్కువ ఉన్న సుబ్బరామన్, తన తండ్రి కుంభకోణంలో స్థాపించిన సంగీత పాఠశాలలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు.తర్వాత మద్రాసు వచ్చి పియానో నేర్చుకున్నారు.హెచ్ఎమ్వీలో హార్మోనియం ప్లేయర్‌గా జీవితం ప్రారంభించారు.1943లో తన 22వ ఏట, సుబ్బరామన్ “చెంచులక్ష్మి” చిత్రానికి( Chenchulakshmi Movie ) సంగీతం అందించారు.ఈ చిత్రంలోని “నీ తల్లిని నేను చూడలేను” అనే పాటతో సుబ్బరామన్ కు సినీ సంగీత ప్రపంచంలో మంచి పేరు వచ్చింది.

1945లో, “బాలరాజు” చిత్రానికి( Balaraju ) సంగీతం అందించారు.ఈ చిత్రంలోని “ఓ బాలరాజా” అనే పాట ఘంటసాల కెరీర్‌లో ఒక మలుపురాయిగా నిలిచింది.1947లో, సుబ్బరామన్ కు భానుమతితో పరిచయం ఏర్పడింది.భానుమతి( Bhanumati ) స్వయంగా మ్యుజీషియన్ కావడంతో, సుబ్బరామన్ సంగీతంలోని గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారు.భానుమతి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన “లైలామజ్నూ” చిత్రానికి( Laila Majnu ) సుబ్బరామన్ సంగీతం అందించారు.ఈ చిత్రంలోని “పయనమయే ప్రియతమ నను మరచిపోకుమా” అనే పాట ఘంటసాలకు( Ghantasala ) మరో హిట్ పాటగా నిలిచింది.1949లో, సుబ్బరామన్ “దేవదాసు” చిత్రానికి సంగీతం అందించారు.ఈ చిత్రం సంగీత ప్రపంచంలో ఒక మాస్టర్‌పీస్‌గా నిలిచింది.

Telugu Subbaraman, Chenchu Lakshmi, Devadasu, Ghantasala, Laila Majnu, Musiccomp

ఈ చిత్రంలోని “రావో మము మరచితివో”, “జగమే మాయ”, “ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా” వంటి పాటలు అజరామరమైనవి. “దేవదాసు” చిత్రం ( Devadasu Movie ) విడుదలయ్యే ముందే, సుబ్బరామన్ కు మరణం సంభవించింది.ఆయన మరణించినప్పుడు ఆయన వయస్సు కేవలం 36 ఏళ్లు మాత్రమే.

ఆయన 1916 పుట్టగా 1952లో చనిపోయాడు.సుబ్బరామన్ దక్షిణాది సినీ సంగీతంలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఆయన సంగీతం సాంప్రదాయ సంగీతంతోపాటు, ఆధునిక సంగీతం కూడా కలిసిన ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంది.

Telugu Subbaraman, Chenchu Lakshmi, Devadasu, Ghantasala, Laila Majnu, Musiccomp

ఆయన సంగీతం ప్రేక్షకుల హృదయాలను తాకగల సామర్థ్యం కలిగి ఉంది.సంగీతం తోనే కాకుండా సినిమా నిర్మాణం కూడా చేపట్టి తన భాగస్వాముల చేతిలో విష ప్రయోగం చేయబడి కన్ను మూశారు.అందులో ఒక మహిళ హస్తం కూడా ఉందని అప్పట్లో వినికిడి.

మొత్తం మీద సుబ్బరామన్ బతికింది కొన్నాళ్లయినా సినిమా ఇండస్ట్రీపై తనదైన ముద్ర వేసుకున్నారు.పదేళ్ల తన సినీ కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

ఇలాంటి సంగీత దర్శకులు మళ్లీ తెలుగులో పుట్టాలని సినిమా అభిమానులు కోరుకుంటున్నారు.ఆ లోటును ఎవరు భర్తీ చేస్తారని అడుగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube