Adivi Sesh: మరొక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే సత్తా ఉన్న హీరో అడవి శేష్

ఇలాగే సరిగ్గా కథలని ఎంచుకుంటూ ముందుకు వెళితే రానున్న కాలంలో ఖచ్చితంగా మరో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే అవకాశం ఉన్న హీరో అడవి శేష్. హిట్ 2 సినిమాతో మరోసారి బాక్సాఫీస్ లో వద్ద సంచలనం క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

 Facts About Hero Adivi Sesh Details, Adivi Sesh, Hero Adivi Sesh, Hit 2 Movie, A-TeluguStop.com

ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తోంది.సస్పెన్స్ త్రిల్లెర్స్ కి పెట్టింది పేరుగా ఆది నుంచి అడవి శేష్ ఇదే తరహా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఇక మేజర్ సినిమా విజయవంతం అయిన తర్వాత అడవి శేషుకి అనేక ప్రాజెక్టులు క్యూ కట్టాయి.మేజర్ సినిమా నుంచి హిట్ సినిమాకి మధ్యలో ఏకంగా ఎనిమిది ప్రాజెక్టులకి నో చెప్పాడట.

అయితే గూడచారి 2 సినిమా చేయాలని ఉద్దేశంతో తాను ఉన్నట్టు, అందుకే ఏ ప్రాజెక్టు ని కూడా ఒప్పుకోవడం లేదంటూ అడవి శేషు చెప్తున్నాడు.ఇక బాలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయట ఈ కుర్ర హీరోకి.

నిజానికి పుష్కలంగా టాలెంట్ ఉన్న హీరో.అందుకే అతడికి ఇన్ని సినిమా అవకాశాలు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు.

మొదటి సినిమా నుంచి హిట్ వరకు కూడా అడవి శేష్ వైవిధ్యమైన తరహాలోనే అడవి సినిమాలు చేస్తూ వస్తున్నాడు.మేజర్ సినిమా బాలీవుడ్ లో సైతం మంచి విజయవంతం కావడంతో ప్రస్తుతం అడవి శేష్ పై అక్కడ మేకర్స్ కన్ను పడింది.

Telugu Adivi Sesh, Gudhachari, Pan India, Tollywood-Movie

అడవి శేష్ సైతం మంచి కథలను ఎంచుకుంటూ బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని అనుకుంటున్నాడు.ఒక్క సరైన హిట్టు ఎవరికైనా ఫెట్ మార్చేస్తుంది.ఇందుకు అడవి శేష్ ఏ మాత్రం మినహాయింపు కాదు.అతి త్వరలో గూడచారి టు సినిమాకు సంబంధించిన ఆ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి టాలీవుడ్ లో కాకుండా పాన్ఇండియా సినిమాగా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నాడు.

ఈ సినిమా కనుక విజయం సాధిస్తే కచ్చితంగా బాలీవుడ్ లో మరో తెలుగు హీరో సత్త చాటే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube