Anaswara Rajan: అనస్వర రాజన్.. గుర్తుపెట్టుకోండి ఈమె మరొక పాన్ ఇండియన్ హీరోయిన్ అవుతుంది

కొంతమంది హీరోయిన్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.మన తెలుగులో అయితే కేవలం కమర్షియల్ సినిమాల్లో నటించడానికి మాత్రమే హీరోయిన్స్ ఇష్టపడతారు.

ఉదాహరణకు శ్రీలీలనే( Sreeleela ) తీసుకోండి.ఒక్క సినిమా హిట్ అయింది అంతే ఏడ పెడ ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకొని ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మాయమైపోయే పరిస్థితికి వచ్చింది.

కానీ మలయాళ సినిమా పరిశ్రమలో శ్రీ లీల లాగానే మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి ఉంది.ఆమె పేరు అనస్వర రాజన్.

( Anaswara Rajan ) మలయాళీ అమ్మాయి అయినా ఈ 2l ఏళ్ళ హీరోయిన్ .పిచ్చిపిచ్చి సినిమాలను ఎంచుకోవడం లేదు.మంచి కథలు స్కోప్ ఉన్న పాత్రలను సెలెక్ట్ చేసుకుంటుంది.

Advertisement

ఏది పడితే అది అవసరం లేదు అంటుంది.

అందంలోనూ, అభినయంలోనూ ఏమాత్రం తీసిపోదు.చూడ్డానికి ఇంటర్ చదివే అమ్మాయిల కనిపిస్తుంది.కానీ మోహన్ లాల్ కి( Mohan Lal ) సైతం దీటుగా నటించి తన నటన ఏంటో మరోసారి అందరికీ చూపించింది 2018 లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పటివరకు దాదాపు 16 పైగా సినిమాల్లో నటించి ఆమె సత్తా ఏంటో చూపించింది.ప్రస్తుతం తన గాలి వీస్తుంది కదా అని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేస్తే ఆమె కూడా మరో శ్రీ లీల అయి ఉండేది.

ఏది ఏమైనా మలయాళంలో( Malayalam ) నటించే హీరో హీరోయిన్స్ ఎవరైనా కూడా డబ్బు, కమర్షియల్ అనే హంగులకు పోకుండా మెరిట్ ఉన్న పాత్రలను చేయడానికి ఇష్టపడతారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అందుకే మలయాళ సినిమాల్లో నటిస్తే మంచి పాత్రలు వస్తాయి అలాగే సుదీర్ఘకాలం కెరియర్ ఉండే అవకాశం ఉంటుంది.మోహన్ లాల్ పక్కన 21 అమ్మాయి ఇరగదీసింది అంటే ఆమె ఏ స్థాయి నటి అయి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.మోహన్ లాల్ , అనస్వర కలిసి నటించిన సినిమా నెరు( Neru Movie ) ఇది ఓటిటి లో ఉంది.

Advertisement

ఈ సినిమాకు దర్శకత్వం వహించింది జీతూ జోసెఫ్.ఈ పేరు చెబితే చాలు అది ఎలాంటి సినిమా అయి ఉంటుందో కూడా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.

దృశ్యం సినిమాల లాగానే అతడు తీసిన ఈ సినిమా కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమా.చాలా చప్పిడిగా సాగే అనేక సీన్లను సైతం తన స్క్రీన్ ప్లే తో అద్భుతమైన సీన్స్ గా మలచగల శక్తి ఉంది జీతు జోసెఫ్ కి.

తాజా వార్తలు