చలం( Actor chalam ) ఎంతో సహజ సిద్ధంగా నటిస్తూ ఎన్టీఆర్ అక్కినేని వంటి హీరోలకు దీటుగా అప్పట్లో కెరియర్ కొనసాగించాడు హీరోగా, సెకండ్ హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందకు పైగా సినిమాలు నటించాడు.నిర్మాతగా మారి డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు అయితే ఆయన సినిమా జీవితం ఎంతో విజయవంతమైనదే అయినప్పటికీ వ్యక్తిగతమైన జీవితం మాత్రం అనేక వివాదాల చుట్టూ సాగింది చలం ఒక పర్వర్టడ్ గా మారిపోయి ఆడవాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాడు అనే స్థాయికి అతడు వెళ్లిపోయాడు చివరికి ఎంతో దీనమైన స్థితిలో కన్నుమూశాడు.
చలం జీవితంలో మొత్తం ముగ్గురు ఆడవాళ్లకు స్థానం ఉండగా ముగ్గురితోనూ అనేక వివాదాలను ఎదుర్కొన్నాడు.

కెరియర్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే రమణ కుమారి( Ramana Kumari ) అనే మహిళను పెళ్లి చేసుకోగా ఆమె పేరులోని సగాన్ని తన పేరుకు జోడించుకుని రమణా చలం గా సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యాడు.అయితే శారదతో ప్రేమలో పడటంతో రమణ కుమారితో విభేదాలు మొదలయ్యాయి.వారి ప్రేమను ఒప్పుకోలేని రమణ కుమారి ఆత్మహత్య చేసుకుని మరణించింది.
అలా మొట్టమొదటిసారి అతని గురించి సినిమా ఇండస్ట్రీ కాకుండా సొసైటీ చెడుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది.ఎంత వేధిస్తే అమే చనిపోయిందో అని అప్పట్లో అందరూ వారి గురించి అనుకున్నారు శారదని కూడా తిట్టిపోసుకున్నారు.
ఆ తర్వాత అతడికి కెరియర్ కూడా నెమ్మదించడం మొదలుపెట్టింది.ఒక రెండు మూడేళ్లకు శారద( Sarada )ను కూడా పెళ్లి చేసుకున్నాడు అయితే పెళ్లయ్యాక కానీ శారదకు( Sarada ) విషయం అర్థం కాలేదు.
ఆమె సినిమాల్లో బిజీగా ఉంటూ డబ్బులు సంపాదిస్తే వాటిని ఖర్చు పెట్టడానికే చలం ఉండేవాడు.

ఇక అతడి వేధింపులను భరించలేక ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయి అతడికి విడాకులు ఇచ్చింది.ఆ తర్వాత మలయాళం లో ఒక డాన్సర్ తో సహజీవనం చేశాడు.సరిగ్గా చనిపోవడానికి నెల ముందు పూర్తిస్థాయి సైకోగా మారిపోయాడు.
ఎంతలా అంటే నిద్రపోతున్న ఆ డాన్సర్ వీపుపై రుబ్బురోలు పడేయడంతో ఆమె వెన్నుపూస విరిగిపోయింది.ఆ తర్వాత నెల వ్యవదిలోనే చలం కూడా కన్నుమూశాడు.







