Director T Krishna: దర్శకుడు టి కృష్ణ తన కొడుకులకు ఎవరి పేర్లు పెట్టారో తెలుసా ?

అభ్యుదయ దర్శకుడిగా టాలీవుడ్ లో పెట్టింది పేరు అయినా వ్యక్తి టి.కృష్ణ.

 Fact Behind Director T Krishna Sons Gopichand Premchand Names-TeluguStop.com

( Director T Krishna ) పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే ఒక డాక్యుమెంటరీ సినిమాతో 1981 లో సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన టి కృష్ణ దర్శకుడిగా మాత్రం సినిమా ఇండస్ట్రీ లో మూడేళ్లు మాత్రమే ఉన్నారు .ఈ మూడేళ్ళ అతి తక్కువ కాలంలోనే సమాజం పై ప్రభావము చూపే సినిమాలు తీసి నేటికీ అయన మన అందరికి ఒక ఆదర్శవంతమైన దర్శకుడిగా మిగిలిపోయారు.1983 లో నేటి భారతం అనే సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న కృష్ణ మూడేళ్ళ లో ఏడు సినిమాలను తీశారు.అన్ని చిత్రాలు హిట్ చిత్రాలుగా పేరు దక్కించుకున్నాయి.

Telugu Krishna, Gopi Chand, Gopichand, Prema Chand, Repati Pourulu-Movie

నేటి భారతం, దేశం లో దొంగలు పడ్డారు, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన, పకారాతిను పకారమ్, రేపటి పౌరులు వంటి సినిమాలను డైరెక్ట్ చేసారు.పకారాతిను పకారమ్ అనే మలయాళ సినిమా కూడా ఉండటం విశేషం.టి కృష్ణ సమాజంలో తన సినిమా ల ద్వారా ఒక మార్పు రావాలని ఎంతో ప్రయత్నించారు.అలాగే ఎక్కువగా పుస్తకాలను కూడా చదవటం ఆయనకు ఉన్న అలవాటు.

చివరగా 1986 లో రేపటి పౌరులు సినిమాను విడుదల చేసి అదే ఏడాది అయన కన్ను మూసారు.ఇక టి కృష్ణ కు పుస్తకాలు, రచయితలు అంటే ఎంత ఇష్టం అంటే ఏకంగా తన పిల్లలకు కూడా వారి పేర్లనే పెట్టుకోవడం విశేషం.

Telugu Krishna, Gopi Chand, Gopichand, Prema Chand, Repati Pourulu-Movie

టి కృష్ణ పెద్ద కుమారుడు ప్రేమ్ చంద్( Premchand ) కాగా చిన్న కుమారుడు మన అందరికి తెలిసిన హీరో గోపి చంద్.( Gopichand ) ప్రేమ్ చంద్ కి కర్మభూమి,రంగ్ భూమి వంటి ఎంతో గొప్ప రచనలను రాసిన ప్రముఖ బెంగాలీ రైటర్ అయినా ప్రేమ్ చంద్ పేరునే పెట్టుకున్నారు.ఇక అసమర్ధుని జీవిత యాత్ర అనే రచనను అందించిన రచయిత గోపి చంద్ పేరు చిన్న కొడుకుక్కి పెట్టుకున్నారు, ఇలా అద్భుతమైన రచయితలపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.కృష్ణ పెద్ద కొడుకు తండ్రి లాగ డైరెక్టర్ అవ్వాల్సి ఉండగా ఒక రోడ్డు ప్రమాదం ఆయన్ను మింగేసింది.

ఇక గోపి చంద్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి హీరోగా ఉన్న విషయం మన అందరికి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube