ఎఫ్3 నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుంది.. ముహూర్తం ఫిక్స్..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

సంక్రాంతి అల్లుళ్లుగా బరిలోకి దిగి నవ్వులు పూయించారు.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఈ సినిమాకు సీక్వేల్ గా ఎఫ్ 3 సినిమాను తీస్తున్నాడు.ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ నటించారు.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా నటిస్తుంటే, వరుణ్ సరసన మెహ్రీన్ నటిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఎఫ్ 2 ఇప్పుడు మరింత ఫన్ తో ఎఫ్ 3 గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సమ్మర్ లో ట్రిపుల్ ఫన్ అందించడానికి వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే విడుదల అయ్యి మంచి స్పందన తెచ్చుకున్నాయి.

Advertisement

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.ఈసారి నవ్వులు పూయించడానికి సమ్మర్ సోగ్గాళ్లుగా రాబోతున్నారు.తాజాగా ఈ సినిమా మొదటి సింగిల్ కి సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

ఈ సినిమా మొదటి సింగిల్ ను ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు అంటూ సాగే ఈ పాట ను విడుదల చేస్తున్నామని పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఇది డబ్బు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని ముందు నుండే చెబుతూ వస్తున్నారు.ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యిందట.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

ఇంకా ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది.ఇక ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహన్ కూడా కనిపించి సందడి చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు