టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్( Venkatesh ) వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ వరుసగా విజయాలను సొంతం చేసుకున్నారు.
వెంకటేష్ తో పలు సినిమాలలో నటించిన సీనియర్ నటుడు ప్రదీప్ ( Actor Pradeep )అంతేగా అంతేగా డైలాగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.ప్రదీప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ప్రతి భర్త రోజుకు ఒకసారైనా అంతేగా అంతేగా అని చెబుతారని ఆయన అన్నారు.
వెంకటేశ్ తో నేను చాలా సీన్స్ చేశానని ఎఫ్2 ( F2 )సినిమాకు ముందు వెంకటేశ్ తో పెద్దగా పరిచయం లేదని ప్రదీప్ అన్నారు.వెంకీ మంచివారని తెలుసని ఆయన పేర్కొన్నారు.
వెంకటేశ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ అని అధ్యాత్మికత ఎక్కువగా ఉన్న హీరో ప్రదీప్ అని ఆయన కామెంట్లు చేశారు.స్టార్ హీరో అయినా వెంకటేశ్ మామూలు యాక్టర్ లా ఉంటారని ప్రదీప్ అన్నారు.
మేమిద్దరం ఒకటే ఏజ్ గ్రూప్ అని ఆయన తెలిపారు.
ప్రగతి చాలా సరదాగా ఉంటారని ప్రదీప్ వెల్లడించారు.మేము నిజంగా ఒక కుటుంబంలా కలిసిపోయామని ప్రదీప్ అన్నారు.ప్రగతి నాకోసం కాఫీ చేసి తెచ్చిందని మా మధ్య అంత బాండ్ ఏర్పడిందని అయన తెలిపారు.
వెంకీ, వరుణ్ మధ్య ఇగో ఉంటే ఎఫ్2, ఎఫ్3 రావని ప్రదీప్ అన్నారు.వెంకటేశ్ డైలాగ్ ను మరిచిపోతే ఒక రకమైన జిబ్రిష్( Gibrish ) భాష మాట్లాడతారని ప్రదీప్ వెల్లడించారు.
వెంకటేశ్ ప్రస్తుతం సైంధవ్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఈ ఏడాదే డిసెంబర్ నెలలో రిలీజ్ కానుంది.హిట్, హిట్2 ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.సైంధవ్ సినిమా వెంకటేష్ సినీ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.