తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎన్నికల నగారా కొన్ని నెలల్లో మోగబోతోంది.ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే చాలామంది నేతలు వారి వారి నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు.
ఇక అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే సభలు సమావేశాల పేరుతో పర్యటిస్తున్నారు.
కానీ ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలకు మాత్రం ఈసారి టికెట్ కష్టమే అన్నట్టు ఉంది.కేసీఆర్( KCR ) ప్రకటించే ఫస్ట్ లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయి ఎవరి పేర్లు ఉండవు అనేది ప్రకటిస్తే గాని తెలియదు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
అంతేకాకుండా ఇదివరకు టికెట్ కోసం ఆశించి పార్టీ కోసం పని చేసి భంగపడ్డ చాలామంది నేతలు ఈసారి టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఆ నేతలకు కూడా ఈసారి అవకాశం కల్పించే దిశగా కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.ఆయన ఫస్ట్ లిస్టు ప్రకటిస్తే కానీ ఏ నాయకుడికి టికెట్ వస్తుంది, ఏ నాయకుడికి రాదు అనేది పూర్తిగా తెలుస్తుంది.

అయితే ఈ మొదటి లిస్టులో జనగాం, స్టేషన్గన్పూర్, ఇల్లందు, మునుగోడు(Munugode), భద్రాచలం, మహబూబాబాద్, ఉప్పల్, వైరా వంటి నియోజకవర్గాలు వివాదాస్పదంగా ఉండడంతో వాటిని సెకండ్ లిస్టులో ప్రకటించే అవకాశం ఉంది.బీఆర్ఎస్ పార్టీ లిస్టు ప్రకటించిన తర్వాత ఎంతోమంది టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలను బిజెపి (BJP) లాక్కునే ప్రయత్నాలు చేస్తోంది.

త్వరలో బిజెపి ఈనెల 27న ఖమ్మంలో జరిగే అమిత్ షా (Amith sha) సభలో 22 మంది లీడర్లను వారి పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తుంది.ఇప్పటికే 22 మంది సీనియర్ నాయకులు బిజెపి పార్టీ కండువా కప్పుకోనున్నారని, వారంతా కేసీఆర్ లిస్టు ప్రకటించిన తర్వాత అందులో టికెట్ రాని నేతలే ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మరి లిస్టు ప్రకటించడం తర్వాత కేసీఆర్ అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగిస్తారో ముందు ముందు తెలుస్తుంది.