వైసీపీ పార్టీని తిడుతూ జనసేనను పొగుడుతూ.. ఇంటర్వ్యూలో పృథ్వి రాజ్ వైరల్ కామెంట్స్!

బాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్ గురించి మనందరికి తెలిసిందే.ఇటీవ సోషల్ మీడియాలో ఒక వీడియోని పంచుకున్న పృథ్వి రాజ్ తాను పశ్చతాపపడుతున్నట్లు తెలిపాడు.

 Ex Svbc Chairman Comedian Pruthvi Raj Open Heart With Rk Latest Promo Details, Prudhvi Raj,open Heart With Rk, Tollywood, Ycp, Chiranjeevi, Pawan Kalyna, Janasena Party, Ycp, Ambati Ram Babu, Pruthvi Raj Comments-TeluguStop.com

పవన్ కళ్యాణ్ గారో, చిరంజీవి గారో,కళ్లు నెత్తికెక్కి ఆరోజు తిట్టాను మహాప్రభో అహంకారం, మదం, కొవ్వు ఏదైనా అనుకోండి.నా వెనుక కొండంత అండ ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడాను.

అప్పట్లో విర్రవీగి మాట్లాడాను.ఇప్పుడు నాకు బుద్ధివచ్చింది.

 Ex Svbc Chairman Comedian Pruthvi Raj Open Heart With Rk Latest Promo Details, Prudhvi Raj,open Heart With Rk, Tollywood, Ycp, Chiranjeevi, Pawan Kalyna, Janasena Party, Ycp, Ambati Ram Babu, Pruthvi Raj Comments-వైసీపీ పార్టీని తిడుతూ జనసేనను పొగుడుతూ.. ఇంటర్వ్యూలో పృథ్వి రాజ్ వైరల్ కామెంట్స్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నన్ను క్షమించండి.మార్పు చెందిన నేను ఒక్క అడుగు వేస్తే మీరు వంద అడుగులు ముందుకు నడిపించాలని కోరుతున్నా అంటూ కమెడియన్ పృథ్వీరాజ్ పశ్చాత్తాపపడ్డాడు.

ఆ తరువాత జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు పృథ్వీరాజ్.అయితే ఆ పార్టీ నుంచి సానుకూలత లభించకపోవడంతో పాటు జనసేన సైనికులు కూడా పృథ్వీరాజ్ తిట్టిన తిట్లని మర్చిపోలేకపోవడంతో పాటు పృథ్వీరాజ్ ను వ్యతిరేకిస్తున్నారు.

కానీ అయితే పృథ్వీ మాత్రం జనసేన పార్టీలో జాయిన్ కాకుండానే ఆ పార్టీ తరుపున మాట్లాడుతూ.వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో కూడా జోస్యం చెప్పేస్తున్నారు.

తాజాగా ఏబీఎన్ ఛానల్‌లో ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్ తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్టు క్లారిటీ ఇస్తూ,తాను ఏ పార్టీ కోసం అయితే ఇన్ని రోజులు పనిచేస్తూ వచ్చారో ఆ అధికార వైసీపీ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పృథ్వీరాజ్.ఎదురుగా ఆర్కే ఉండటంతో మరింత చెలరేగిపోయారు.

Telugu Ambati Ram Babu, Chiranjeevi, Janasena, Heart Rk, Pawan Kalyna, Prudhvi Raj, Pruthvi Raj, Tollywood-Latest News - Telugu

ఆర్కే తనదైన శైలిలో ప్రశ్న వేయడం పృథ్వీ రెచ్చిపోయి అనేక విషయాలపై ఓపెన్ కామెంట్స్ చేశారు.వైసీపీ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన తనకి వచ్చింది కాదని ఒకతను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకి శిక్షణ ఇచ్చినట్టుగా తన మైండ్ మొత్తాన్ని పొల్యూట్ చేశారని చెప్పుకొచ్చారు పృథ్వీ.అలాగే ముఖ్యమంత్రి జగన్‌ని కలిసినప్పుడు ఆయన బిహేవియర్‌ని ఇమిటేట్ చేసి చూపించారని,తొమ్మిది నెలలకు పురుడుపోస్తారు కానీ వైసీపీ వాళ్లు నాకు మూడో నెలలోనే అబార్షన్ చేసి బయటకు పంపేశారని చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్.వివాదానికి కారణమైన ఆడియో కాల్ విషయం గురించి మాట్లాడుతూ.

నిజంగానే నేను తప్పు చేస్తే నేను నా వైఫ్‌కి సమాధానం చెప్పుకుంటా.కానీ నా విషయంలో అలా చేసి.

అదే తప్పు చేసిన అంబటి రాంబాబుని మినిష్టర్‌ని చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube