వైకాపాలోకి ఇద్ద‌రు మాజీ మంత్రులు..!

2019 ఎన్నిక‌ల కోసం వైకాపా అధినేత జ‌గ‌న్ ఒక్కో జిల్లాను టార్గెట్‌గా చేసుకుంటూ వ‌స్తున్నాడు.

ఇప్ప‌టికే ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లాను టార్గెట్‌గా చేసుకుని అక్క‌డ ఆప‌రేష‌న్‌ను స‌క్సెస్ చేసిన జ‌గ‌న్ ఇప్పుడు ఒక్కో జిల్లాను టార్గెట్‌గా చేసుకుంటూ వ‌స్తున్నాడు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కీల‌క జిల్లాలు అయిన తూర్పుగోదావ‌రి, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల‌ను టార్గెట్‌గా చేసుకుని అక్క‌డ మాజీ మంత్రులు, కీల‌క నాయ‌కులపై వ‌ల వేస్తున్నారు.ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కృష్ణా జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌ను పార్టీలో చేర్చుకోగా ఇదే లైన్లో మ‌రో ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు య‌ల‌మంచిలి ర‌వి, మ‌ల్లాది విష్ణు కూడా ఉన్నారు.

ఇక గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి కాసు వెంక‌ట కృష్ణారెడ్డి త‌న‌యుడు కాసు మ‌హేష్‌రెడ్డి ఇప్ప‌టికే జ‌గ‌న్ చెంత‌కు చేర‌గా ఇదే జాబితాలో మాజీ ఎమ్మెల్యే మ‌క్కెన మ‌ల్లిఖార్జున‌రావు పేరు వినిపిస్తోంది.ఇక ఇదే క్ర‌మంలోనే జ‌గ‌న్ మ‌రో ఇద్ద‌రు మాజీ మంత్రుల‌పై కూడా వ‌ల వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

గుంటూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ పొలిటిషీయ‌న్‌, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌తో పాటు, ప్ర‌కాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డిల‌పై జ‌గ‌న్ వ‌ల వేసిన‌ట్టు స‌మాచారం.వైకాపాలో చేరేందుకు క‌న్నా ఓకే చెప్పినా త‌న‌కు గుంటూరు జిల్లాలో రెండు అసెంబ్లీ టిక్కెట్లు కావాల‌న్న కండీష‌న్ పెట్టార‌ట‌.

Advertisement

ఇక్క‌డే క‌న్నా వైకాపా ఎంట్రీ కాస్త డైల‌మాలో ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి అడుగులు సైతం వైకాపా వైపే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన పోతుల రామారావు టీడీపీలోకి జంప్ చేసేశారు.ఈ క్ర‌మంలోనే మ‌హీధ‌ర్‌రెడ్డిని పార్టీలోకి తీసుకు వ‌స్తే నియోజ‌క‌వర్గంలో వైకాపాకు తిరుగు ఉండ‌ద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

మ‌హీధ‌ర్ వైకాపా ఎంట్రీపై ఎప్ప‌టి నుంచో వార్త‌లు ఉన్నా ఎంట్రీ మాత్రం లేట్ అవుతూ వ‌స్తోంది.ఈ ఇద్ద‌రు మాజీ మంత్రులు వైకాపాలో చేరితే వైకాపాకు మ‌రింత జోష్ వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు