దర్శకుడు ఈవీవీ కితకితలు సినిమా కథ ఎక్కడ నుంచి కాఫీ కొట్టారో తెలుసా ?

ఈ మధ్యకాలంలో సినిమా తీయాలంటే ప్రతి ఒక్కరూ అంతకు ముందు నాలుగైదు షార్ట్ ఫిలిమ్స్ తీసి, లేదంటే బాగా సినిమాలు చూసిన అనుభవం ఉంటే చాలు అని అనుకునేవారు.కానీ సినిమా తీయాలంటే నిన్నటి తరం దర్శకులకు అదొక తపస్సులా ఉండేది ప్రతి సన్నివేశం గురించి ఎన్నో నిద్రలేని రాత్రులు వారికి అనుభవాలను ఇచ్చేవి.

 Evv Copied Kitakitalu Story From Bhgyaraja Chinnaveedu,evv Satyanarayana,allari-TeluguStop.com

ప్రతి ఆలోచన పొరల వెనుక నిగూఢ రహస్యాలు ఉండేవి.అలాంటి దర్శకులకు నేటి సినిమాలు ఏ విధంగా కనిపిస్తాయో తెలియదు కానీ నిన్నటి తరం సినిమాలు నేటి దర్శకులకు ఖచ్చితంగా మంచి ఉదాహరణలనే చెప్పాలి.

ఇక ఈ మధ్యకాలంలో ఈవీవీ సత్యనారాయణ తీసిన కితకితలు సినిమా మీకు గుర్తుండే ఉంటుంది ఈ సినిమాను పోలిన మరొక సినిమా 80వ దశకంలో వచ్చి అభిమానులను ఎంతగానో అలరించింది.తమిళంలో చిన్న వీడు పేరుతో భాగ్యరాజు తీసిన సినిమా తెలుగులో చిన్న ఇల్లు పేరుతో అనువాదమైంది.

బహుశా వివాహేతర సంబంధాన్ని సినిమాల్లో చూపించడం అనేది అప్పటినుంచి ప్రారంభమైంది.ఇదే తరహా కథతో ఈవీవీ కితకితలు తీశారు.ఇక ఈ సినిమాలో ఊపిరి సినిమాలో పనిమనిషి పాత్రలో నటించిన కల్పనని హీరోయిన్ గా పెట్టారు.ఇప్పటికీ రాదా విజయశాంతి శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్స్ భాగ్యలత సినిమా కోసం క్యూ కడుతుండగా అతడు కల్పనని ఎంచుకున్నాడు.

అంతేకాదు ఈ సినిమా కోసం ఆసియా ఖండంలోనే తొలిసారిగా మహిళా సినిమాటోగ్రాఫర్ అయినా బిఆర్ విజయలక్ష్మిని తీసుకున్నారు.ఇక హీరో తల్లి పాత్ర కోసం అప్పుడప్పుడే వస్తున్న అప్ కమింగ్ కమీడియన్ కోవై సరళని తీసుకోవడం కూడా సంచలమైన నిర్ణయం అనే చెప్పాలి.

Telugu Allari Naresh, Bhagyaraja, Evv, Kithakithalu-Telugu Top Posts

ఇక ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య జరిగే శృంగార సమయంలో అమ్మవారికి అభిషేకం చేస్తున్న సన్నివేశాన్ని చూపించి దాంపత్యం అంటే అభిషేకం చేస్తున్నంత పవిత్రమైనది అనే భావన కల్పించారు దర్శకుడు భాగ్యరాజా. అలాంటి ఒక ఆలోచన రావడం నిజంగా భాగ్యరాజా దర్శకుడికే చెల్లింది.అందుకే భాగ్యరాజా ఒక గొప్ప దర్శకుడు అని చెప్పాల్సిన అవసరం లేదు.అందుకే భాగ్యరాజా లాంటి దర్శకుడిని ఈవీవీ ఫాలో అయ్యారు అనే చెప్పాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube