అధికార వైసీపీలో చిత్రమైన చర్చ సాగుతోంది.ప్రస్తుతం సాగుతున్న కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసింది.
ఐదు రూపాయాలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను తిరిగి తెరుస్తామ ని.పన్నులు రద్దు చేస్తామని, మంచి నీటి కుళాయి కనెక్షన్లు.ఫ్రీగా ఇస్తామని.ఇలా అనేక హామీలతో టీడీపీ రెండు పేజీల మేనిఫెస్టోను విడుదల చేసింది.అయితే.ఇది ఏమేరకు ప్రభావం చూపుతుందనేది పక్కన పెడితే.
ఈ విషయంలో టీడీపీలో కన్నా.వైసీపీలోనే ఎక్కువగా చర్చనీయాంశం అయింది.
“అన్నా.ఇదేంది.మనం ఏదో అనుకుంటే.ఇప్పుడు టీడీపీ ఇలా చేస్తోంది.మనం కూడా మేనిఫెస్టో విడుదల చేద్దాం“ అని ఒకరిద్దరు.నాయకులు చర్చించుకుంటున్నారు.
అయితే.దీనిపై సీనియర్ నాయకులు మాత్రం ష్.గప్‌చుప్.అంటూ.
సందేశాలు పెడుతున్నారు.దీనికి కారణం ఆరాతీస్తే.
టీడీపీ తాజాగా ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోలో కొత్తగా చెప్పిన అంశాలు లేవని.ఈ విషయంలో వారితో వైసీపీకి పెద్దగా పోటీ ఉండదని.
పార్టీ అధిష్టానంభావిస్తున్నట్టు సీనియర్లు ప్రచారం చేస్తున్నారు.

ఇక, అదేసమయంలో కార్పొరేషన్ ఎన్నికలకు మేనిఫెస్టో ఇవ్వడం అంటే.దిగజారిపోవడమేననిఇప్పటికే సీఎం అభిప్రాయపడుతున్నట్టు కొందరు సీనియర్లు అంటున్నారు.ఇలా మొత్తంగా చూస్తే.
వైసీపీలో టీడీపీ మేనిఫెస్టో కలకలం రేపింది.దీనిపై కొన్ని మునిసిపాలిటీల్లో వైసీపీ తర్జన భర్జన పడుతోంది.
ప్రధానంగా నగరాలు.పట్టణాల్లో రూ.5కే అన్నం అంటే.ప్రజలు, కార్మికులు ఆదానివైపు మొగ్గు చూపడం కాయమని.
సో.ఇదివైసీపీపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.మొత్తంగా చూస్తే.లోలోన మథన పడుతున్నా.పైకి మాత్రం టీడీపీ మేనిఫెస్టోపై గుంభనంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.