18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలి - అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ కోరారు.బుధవారం కలెక్టరేట్ లో 2వ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం, ఓటర్ జాబితా తయారీ, ఓటరు నమోదు పురోగతి, ఓటరు జాబితా సవరణ తదితరాలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా అదనపు కలెక్టర్ చర్చించారు.

2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారందిరినీ ఓటరుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీలు ప్రోత్సహించాలన్నారు.భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 24 నుంచి జూలై 24 వరకు పోలింగ్ కేంద్రాల పరిశీలన, ఓటరు జాబితాలో సవరణలు, మొదలగు పనులు పూర్తి చేసి ఆగస్టు 2న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఆగస్టు 2 నుంచి ఆగస్టు 31 వరకు ఓటరు జాబితా పై అభ్యంతరాలు, నూతన ఓటరు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.జిల్లాలో ఓటర్ల జాబితా పై వచ్చిన అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సెప్టెంబర్ 22 లోపు పరిష్కరించి, అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా తయారు చేయనున్నట్లు తెలిపారు.

మరణించిన ఓటర్లు, గ్రామము వదిలి వెళ్లిపోయిన వారు, ఓకే ఓటరు రెండుసార్లు వచ్చిన వారి పేర్లను గుర్తించి నిబంధనల మేరకు నోటీసులు జారీ చేసి వివరాలు తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన నాణ్యత ఓటరు జాబితా తయారు చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులకు సహకరించాలని కోరారు.

Advertisement

ఈ సమావేశంలో వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్, తహశీల్దార్ లు విజయ్ కుమార్, రాజు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News