జగన్ మద్దతు ఎవరికో ? పీకే సలహా ఏంటో ? 

దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ప్రభావం కోల్పోతూ ఉండగా,  ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ సైతం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

 Jagan, Ysrcp, Ap Cm, Prashant Kishor, West Bengal Cm, Mamata Banerjee, Nda, Upa,-TeluguStop.com

దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం,  ధరల పెరుగుదల,  పెట్రోల్ ,గ్యాస్ , డీజిల్ ధరలు, ఇలా ఎన్నో అంశాలు బీజేపీపై జనాల్లో వ్యతిరేకత పెంచుతున్నాయి.దీంతో మళ్లీ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరో వైపు చూస్తే కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల కూటమి కూడా తెరపైకి వస్తోంది.ఈ కూటమిని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,  తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు,  ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల మద్దతు తో జాతీయస్థాయిలో చక్రం తిప్పాలనే వ్యూహంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు.

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు .

రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం లేదనే విషయం స్పష్టం అయిపోయింది.  ఇక ప్రస్తుత ఏపీ సీఎం జగన్ వైఖరి 2024 ఏ విధంగా ఉండబోతోంది ? కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారు అనేది తేలాల్సి ఉంది.కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ లో జగన్ చేరే అవకాశం లేదు.

  ఆ పార్టీకి వ్యతిరేకంగానే వైసీపీ  ఆవిర్భవించింది.పోనీ ఎన్.డి.ఏ  లో చేరతారా అంటే అది కూడా ఛాన్స్ లేదు .ఎన్ డి ఏలో చేరేందుకు జగన్ కు ఎప్పుడో అవకాశం వచ్చినా,  ఆయన ఎన్.డి ఎ లో చేరేందుకు ఇష్టపడలేదు.అయితే తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లోనే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కూటమి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Telugu Ap Cm, Jagan, Mamata Banerjee, Strategy, Prashant Kishor, Bengal Cm, Ysrc

అలాగే తన స్నేహితుడైన తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ప్రాంతీయ పార్టీల కూటమి లో ఉండడం, ఈ కూటమిలో కీలకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మారడం ఇవన్నీ జగన్ ను ఆలోచనలో పడేస్తున్నాయి.ఇప్పటికే మమత దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలను తమ కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తోను భేటీ అయ్యారు.అసలు యూపీఏ ఉందా అంటూ కాంగ్రెస్ పై ఆమె కామెంట్ చేశారు.2014 ఎన్నికల తర్వాత ఎన్డీఏ కానీ , యూపీఏ కానీ ఉండదని ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని నమ్మకంగా ఉన్నారు.దీనికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా తోడవుతుండడం తో  ప్రాంతీయపార్టీల కూటమిపై ఆసక్తి పెరుగుతోంది.అయితే ఈ విషయంలో జగన్ నిర్ణయం ఎలా తీసుకుంటారు ? దీనికి ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏ విధమైన సలహాలు జగన్ కు ఇస్తారు అనేది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube