విజ‌య‌వాడ వైసీపీలో త‌లోదారి.. పార్టీ పుంజుకునేనా...?

రాజ‌కీయంగా భిన్న‌మైన న‌గ‌రం విజ‌య‌వాడ‌.ఇక్క‌డ అన్నిసామాజిక వ‌ర్గాలు, అన్ని నియోజ‌క‌వ‌ర్గా్ల‌లోనూ బ‌ల‌మైన ఓటు బ్యాంకుగానే ఉన్నాయి.

కేవ‌లం ఓ నియోజ‌క‌వ‌ర్గంలో ఓ వ‌ర్గం మాత్ర‌మే ఉంది.దానిని న‌మ్ముకుంటే చాల‌నే ప‌రిస్థితి లేదు.

వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చి ఇక్క‌డ స్థిర‌ప‌డిన వారు.వ్యాపారాల రీత్యా ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చి ఇక్క‌డ నివాసం ఉంటున్నారు.

రాజ‌ధాని జిల్లాగా మారిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వ శాఖ‌లు, ప్ర‌భుత్వ ఉద్యోగాలు చేస్తున్న‌వారు ఇక్క‌డ పెరిగారు.దీంతో విజ‌య‌వాడ అంటే.

Advertisement

స‌ర్వ కుల‌, స‌ర్వ‌మ‌త న‌గ‌రంగా పేరు తెచ్చుకుంది.ఒక‌ప్పుడు వ్య‌క్తుల న‌గ‌రంగా ఉన్న విజ‌య‌వాడ‌.

ఇప్పుడు ఎటు గాలి వీస్తే.అటే అన్న‌చందంగా మారింది.

ఈ క్ర‌మంలో న‌గ‌రంలో ఆది నుంచి ప‌ట్టున్న టీడీపీ ఓటు బ్యాంకు స్థిరంగా ఉంది.అయితే వైసీపీకి సొంత బ‌లం అంటూ లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొని.త‌న బ‌లంగా ప్ర‌ద‌ర్శించుకుంటోంది.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
డిసెంబర్ 31 లోపు అలా చేయాల్సిందే.. పాన్ కార్డ్ కొత్త రూల్స్..

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి గెలిచిన‌విష్ణు.కాంగ్రెస్ సానుభూతి ప‌రుల ఓటు బ్యాంకునుంచే విజ‌యం ద‌క్కించుకున్నారు.

Advertisement

ప‌శ్చిమ‌లో అయితే.వ్య‌తిరేక ఓటు ప‌లితంగా మంత్రి వెలంప‌ల్లి విజ‌యం సాధించారు.

ఇక‌, తూర్పులో మాత్రం క‌మ్మ ఓటు బ్యాంకు స్థిరంగా టీడీపీకి బ‌లంగా మారింది.

ఈ నేప‌థ్యంలో అత్యంత కీల‌క‌మైన న‌గ‌రంలో వైసీపీ పాగా వేయాలంటే.స్థిర‌మైన ఓటు బ్యాంకును అందిపుచ్చుకోవాలంటే.ఎంతో క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది.

ఎటు చూసినా.ప‌ది కిలోమీట‌ర్ల ప‌రిధి కూడా లేని న‌గ‌రంలో జ‌న‌సాంద్ర‌త మాత్రం భారీగా ఉంది.

ఇక్క‌డ అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తే.పార్టీకి .ఇక్క‌డ శాశ్వత ఓటు బ్యాంకు ఏర్ప‌డ‌డం ఖాయం.అదేస‌మ‌యంలో కొండ ప్రాంత వాసుల‌కు ప‌ట్టాలు ఇస్తామ‌ని ద‌శాబ్దాలు గ‌డుస్తున్నా.

ఇప్ప‌టికీ ఆ స‌మ‌స్య ఒక కొలిక్కిరాలేదు.ర‌హ‌దారుల విస్త‌ర‌ణ చేయాల‌ని.

సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గా్ల‌లో ద‌శాబ్దాలుగా డిమాండ్ ఉంది.ఆసియాలోనే అతిపెద్ద‌దైన బ‌స్టాండ్‌, కూర‌గాయ‌ల మార్కెట్‌, వ‌స్త్ర దుకాణం.

వంటివి ఉన్న‌ప్ప‌టికీ.ర‌హ‌దారులు లేని ఫ‌లితంగా ప్ర‌జ‌లు న‌ర‌క యాత‌న ప‌డుతున్నారు.

ఆయా స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల‌ని వైసీపీ నాయ‌కులకు ఎన్ని విన్న‌పాలు చేస్తున్నా.ఎవ‌రికివారే య‌మునా తీరే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు త‌ప్ప‌.

పార్టీని పుంజుకునేలా చేయ‌డంలోను , స్థిర‌మైన ఓటు బ్యాంకును సంపాయించుకునేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌డంలోనూ వారు విఫ‌ల‌మ‌వుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

తాజా వార్తలు