ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లాలో నమోదు అవుతున్నా అయా కేసులలో అధికారులు పకడ్బదీగా పారదర్శకంగా విచారణ చేపట్టాలని,అందుకు ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులకు సూచించారు.

గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో పెండింగ్ కేసులపై,గ్రేవ్ కేసులు, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఎస్సీ / ఎస్టి కేసుల పురోగతి పై సమీక్షా సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరిగాతంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.పెండింగ్ లో ఉన్న కేసులలో త్వరగా పరిశోధన పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలి అని ప్లాన్ ఆఫ్ యాక్షన్,ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు.

ఎస్సీ / ఎస్టి కేస్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని,పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.తరచు ఆసాంఘిక కార్యకలపాలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.సిసిటిఎన్ఎస్ లో నూతనంగా లాంచ్ చేసిన 2.0 అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేయడం జరిగిందని, కేసులకు సంబంధించిన వివరాలు ఏ రోజుకు ఆ రోజు సిసిటిఎన్ఎస్ లో నమోదు చేయాలని సూచించారు.నేర నియంత్రణలో విలేజ్ పోలీస్ అధికారి కీలక పాత్ర అని జిల్లాలో విపిఓ వ్యవస్థ బలోపేతం చేసి గ్రామ స్థాయిలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

గ్రామ స్థాయిలో ఉన్న విలేజ్ పోలీస్ అధికారి తరచు గ్రామాల్లో,పట్టణాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కలిగి యుండి సమగ్ర సమాచారాన్ని సేకరించలని అన్నారు.

Advertisement

నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయడం,కొన్నినెంబర్లు చిన్నగా మరికొన్ని నెంబర్లు పెద్దవిగా(జిగాగ్) వాహనాలకు పెట్టుకుని రోడ్లపైకి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అలాంటి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయలన్నారు.అలాగే హెల్మెట్ లేకుండా ప్రయణిస్తే జరిగే అనర్ధాల గిరించి,హెల్మెట్ వినియోగం గురించి ప్రతి వాహనాదారుడికి అవగాహన కల్పించాలని అన్నారు.జిల్లాల,రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి, సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.

అక్రమ కార్యకలాపాలు అయిన మట్కా,ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, పిడిఎస్ రైస్,వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.నేరాలను నియంత్రణ లో సీసీ కెమెరాలు చాలా ముఖ్య పాత్ర ఉంటుందని సీసీ కెమెరాల ఏర్పాటుకు అందరూ కృషి చేయలని, అదేవిదంగా సీసీ కెమెరాల పనితీరును ప్రతిరోజూ చెక్ చేసుకోవాలని, పనిచేయని సీసీ కెమెరాల గుర్తించి రిపేర్ చేయించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ గత నెలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించిన 44 మంది అధికారులకు సిబ్బంది ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు విస్వప్రసాద్, రవికుమార్, సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేందర్, మోగిలి, వెంకటేష్, బన్సీలాల్, కిరణ్, కరుణాకర్, కృష్ణకుమార్ తదితరులు ఉన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News