వైరల్: మౌంట్ ఎవరెస్టునే కంపు చేసిన మనుషులు... ఈ జనాలు ఇక మారరు!

భరత భూమి మీద జనాభాతో పాటు కాలుష్యం కూడా రోజురోజుకీ దారుణంగా పెరిగిపోతుంది.దాంతో యావత్ మానవాళి భయానక అంచుల్లో బతుకునీడుస్తున్న పరిస్థితి వచ్చింది.

 Everest Has Turned Into 'world's Highest Garbage Dump' Viral , Mount Everest Vi-TeluguStop.com

ఇప్పటికే పట్టణాల్లో పెరుగుతున్న కాలుష్యం కారణంగా మనిషి ఆయువు పట్టు తరిగిపోతున్న దుస్థితి దాపురించింది.భూమి కాలుష్యం కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు, జల కాలుష్యం కావచ్చు.

వీటన్నిటికీ బాధ్యుడు మనిషే అని చెప్పుకోక తప్పదు.అవును, మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం.

ఇలాంటి పరిస్థితుల్లో మనిషి అనేవాడు స్వతహాగా బాధ్యత తీసుకోవలసి వుంది.కానీ ఇక్కడ ఎవరి స్వార్ధం వారిదే.మనం ఎంత స్వార్ధ పరులమంటే దాహంగా ఉందని ఓ వాటర్ బాటిల్ కొనుక్కొని దానిని తాగేసి, అలాగే నలుగురు తిరుగుతున్న రోడ్డు మీద పడేస్తూ ఉంటాం.పక్కనే డస్ట్ బిన్ వున్నా, ఎవరూ దాని వంక కూడా చూడరు.అంతెందుకు… ప్లాస్టిక్ కవర్లు వద్దురా బాబోయ్ అంటున్నా, కిరాణా కొట్టువాడు ప్లాస్టిక్ కవర్ ఇవ్వకపోతే గొడవలు పెట్టుకుంటాం.ఈ రెండు ఉదాహరణలు చాలు మనిషి బాధ్యతా రాహిత్యానికి.

అలా భూమిని కాలుష్యం చేస్తాం సరే.ఆఖరికి మౌంట్ ఎవరెస్టు( Mount Everest ) లాంటి కొండల్ని కూడా వదలకపోతే మనల్ని ఎవరూ కాపాడుతారు.ఆఖరికి ఎవరెస్టును కూడా కంపుకంపు చేశాం మనం.ఎవరెస్టుపై డంప్‌యార్డ్‌( Garbage dump )ను తలపించే ఓ వీడియోలో వైరల్ అవుతోంది.ఎవరెస్ట్ పర్వత శ్రేణులను పర్వతారోహకులు ఎంతో పదిలంగా కాపాడుకుంటారని, దాని పరిరక్షణ వారి బాధ్యతని భావిస్తుంటాం.కానీ మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్ సైట్ మురికి కూపంలా మారింది.

మనుషులు, మౌంట్ ఎవరెస్ట్‌ను కూడా విడిచిపెట్టకుండా చెత్తకుప్పలా, ప్లాస్టిక్ కాలుష్యం( Plastic pollution )తో నింపేశారని ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు వీడియోను షేర్ చేస్తూ కామెంట్ చేయడం ఇక్కడ మనం చూడవచ్చు.దయచేసి ఇలా చేయవద్దు… భవిష్యత్ తరాలను ప్రమాదంలోకి నెట్టవద్దు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube