మిగ్ జామ్ తుపానుపై టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
తుపాను ప్రభావంతో కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సూచనలు చేశారు.ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడొద్దని చెప్పారు.
వర్ష ప్రభావిత బాధితులకు భోజనం, తాగునీరు అందేలా చూడాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు.అలాగే బాధితులకు సాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
విపత్తు అని ముందే తెలిసినా ప్రభుత్వం అలర్ట్ కాలేదని ఆరోపించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తుపాను బాధితులకు వెంటనే సాయం చేయాలని డిమాండ్ చేశారు.
పెరిగిన సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పరిహారం అందించాలన్న చంద్రబాబు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సర్కార్ లెక్కలు వేసుకోకూడదని తెలిపారు.







