చచ్చినా సరే వచ్చేది లేదు....కేంద్రానికి తేల్చి చెప్పిన భారతీయ విద్యార్ధులు..!!

ఉక్రెయిన్, రష్యాల మధ్య భవిష్యత్తులో పోరు మరింత ఉదృతం అయ్యే అవకాశాలు ఉన్న నేపధ్యంలో గడిచిన కొన్ని రోజులుగా భారత్ వచ్చేయండి అంటూ కేంద్రం ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్ధులకు, కుటుంబాలకు, ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది.ఎంత తోదరగా ఉక్రెయిన్ ను వీడితో అంత మంచిదని, ఈ క్రమంలో ఎలాంటి సహాయసహకారాలైనా చేయడానికి ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ సిద్దంగా ఉందని, ఎంబసీని సంప్రదించవచ్చునని ప్రకటించింది.

 Even If You Die, Nothing Will Come Indian Students Who Told The Center , Indian-TeluguStop.com

అయితే కేంద్రం ఇచ్చిన ఈ పిలుపుకు భారత్ నుంచీ కొద్ది రోజుల క్రితమే ఉక్రెయిన్ వెళ్ళిన సుమారు 15౦౦ మంది విద్యార్ధులు స్పందించారు.ఇక్కడ మేము చచ్చిపోయిన పరవాలేదు కానీ అక్కడికి వచ్చేది లేదని తేల్చి చెప్పారు.

అయితే ఎంబసీ తమను సంప్రదించిందని కేంద్రం చెప్పినట్టుగానే ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని విద్యార్ధులు వెల్లడించారు.అయినా సరే భారత్ వచ్చే సమస్య లేదని అంటున్నారు.

తమకు తమ భవిష్యత్తు ఎంతో ముఖ్యమని ఎంతో ఖర్చు చేసుకుని, అప్పులు చేసి మరీ వైద్య విద్య కోసం ఇంత దూరం వచ్చామని, ఇదే విద్య భారత్ లో అత్యంత ఖరీదైన విద్యగా మారిందని అందుకే వలస రావాల్సి వచ్చిందని అంటున్నారు.కాగా.

Telugu Die, Indian Embassy, Indian, Indian Told, Russia, Ukraine-Telugu NRI

సదరు విద్యార్ధులు కేంద్రంపై విరుచుకుపడ్డారు.ఉక్రెయిన్ , రష్యాల మధ్య వార్ మొదలైన సమయంలో భారత ప్రభుత్వం సూచన మేరకు ఇండియాకు తిరిగి వచ్చేశామని ఇందులో అత్యధిక శాతం మంది వైద్య విద్య విద్యార్ధులే ఉన్నారని అయితే వీరి చదువు కొనసాగించడానికి నిభందనలు అడ్డుతగలడంతో విద్యార్ధులు కోర్టును సైతం ఆశ్రయించారు.ఈ క్రమంలో కేంద్రం విద్యార్ధులను భారత్ నిభందనలు విరుద్దంగా చదువును కొనసాగిస్తే భారత వైద్య విద్యా ప్రమాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని చెప్పడంతో విద్యార్ధులు తీవ్ర నిరాశతో మళ్ళీ ఉక్రెయిన్ బాట పట్టారు.కానీ ఇప్పుడు పరిస్థితులు అప్పటికంటే కూడా తీవ్ర రూపం దాల్చుతున్నా విద్యార్ధులు వచ్చేది లేదని తేల్చి చెప్పడంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube