తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఆదివారం గ్రాండ్ ఫినాలేను ఎంతో ఘనంగా జరుపుకుంది.ఈ సీజన్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి.
శ్రీహాన్, రేవంత్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా నిలిచారు.ఇక చివరికి శ్రీహాన్ రేవంత్ మిగలగా నాగార్జున 40 లక్షల రూపాయల మనీ ఆఫర్ చేయడంతో ఇద్దరు కూడా మొదట్లో కప్పు కోసం పోటీ పడ్డారు.25 లక్షల నుంచి నాగార్జున అమౌంట్ పెంచుతూ 40 లక్షలకు చేరుకోవడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్లు శ్రీహన్ పేరెంట్స్ సైతం ఆ డబ్బు తీసుకోమని చెప్పడంతో శ్రీహన్ 40 లక్షల రూపాయల బ్రీఫ్ కేస్ తీసుకొని బయటకు వచ్చారు. రేవంత్ ట్రోఫీ గెలుచుకొని బయటకు వచ్చారు.
ఇకపోతే శ్రీహన్ డబ్బులు తీసుకోవడంతో కొందరు ఈయన పట్ల విమర్శలు కూడా చేస్తున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చినటువంటి శ్రీహాన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను డబ్బు తీసుకోవడానికి గల కారణాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రీహాన్ మాట్లాడుతూ… మొదటినుంచి రేవంత్ కప్పు గెలవాలని చెబుతూ ఉండేవాడు అయితే నాకు గెలవడంతో పాటు డబ్బు కూడా అవసరం ఉంది.ఇంత పెద్ద మొత్తంలో డబ్బును నేను ఎప్పుడూ అందుకోలేదని ప్రస్తుతం నాకు ఆర్థిక పరిస్థితులు కూడా ఎదురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీహాన్ తెలిపారు.
నేను తన అమ్మానాన్నల కోసం బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చానని అయితే మా కుటుంబానికి ప్రస్తుతం డబ్బు ఎంత అవసరం అనేది కేవలం మాకు మాత్రమే తెలుసు.అందుకే నాగార్జున సార్ 40 లక్షల రూపాయలు ఆఫర్ చేయడంతో ముందుగా తన తల్లిదండ్రుల నిర్ణయం తెలుసుకొని వారు తీసుకోమని చెప్పినప్పుడే తాను 40 లక్షల రూపాయలు తీసుకున్నానని నా నిర్ణయాన్ని ప్రేక్షకులు, అభిమానులు కూడా గౌరవిస్తారని ఆశించే అలా చేశానని ఈ సందర్భంగా శ్రీ హన్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.