బండి సంజయ్ ( Bandi Sanjay ) ఈటెల రాజేందర్ మధ్య అస్సలు పొసగడం లేదు అని ఈటెల రాజేందర్ బిజెపిలోకి వచ్చినప్పటినుండి పార్టీ నుండి ఇదే విషయం బయటకు వినిపిస్తోంది.అప్పటివరకు బీఆర్ఎస్ కి దీటుగా ఉన్న బిజెపి పార్టీ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది.
దానికి కారణం కూడా ఈటెల రాజేందర్ ( Etela rajender ) రాకనే అని చాలామంది బిజెపి కార్యకర్తలు ఆరోపించారు.అంతేకాకుండా ఎప్పుడైతే బండి సంజయ్ చేతి నుండి అధ్యక్ష పదవిపోయిందో అప్పటినుండి బిజెపి క్రేజ్ మొత్తం తెలంగాణలో తగ్గిందని చెప్పుకోవచ్చు.
ఇక ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుండి బయటికి వచ్చాక చాలామంది కాంగ్రెస్లోకి వెళ్తారు అనుకున్నారు.
కానీ అధికారంలో లేని కాంగ్రెస్ లోకి వెళ్తే తనపై కెసిఆర్ ( KCR ) వేయించే కేసులు తప్పవని భావించాడో ఏమో కానీ ఈటెల అనూహ్యంగా బిజెపిలోకి వెళ్లారు.
ఇక ఈటెల బీజేపీలోకి వెళ్లాక రాష్ట్ర రాజకీయాలన్ని తన చేతిలోకి వచ్చేలా చేసుకున్నారట.అంతేకాదు బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుండి తప్పించడానికి ప్రధాన కారణం కూడా ఈటెల రాజేందర్ అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి.
అలా టీ బీజేపీలో బండి సంజయ్ వర్గం ఒకవైపు అయితే ఈటెల రాజేందర్ వర్గం మరో వైపయింది.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ( Karimnagar ) నుండి పోటీ చేసిన బండి సంజయ్ ఓడిపోయారు.అలాగే ఈటెల రాజేందర్ హుజురాబాద్ మాత్రమే కాకుండా గజ్వేల్ లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోటీ చేశారు.ఇక రెంటికి చెడ్డ రేవడిలా రెండు చోట్ల ఓడిపోయారు.
దాంతో కొద్దిరోజులు సైలెంట్ అయిపోయిన ఈటెల మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చారు.అయితే మరో రెండు మూడు నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ పార్లమెంట్ ఎలక్షన్స్ పై దృష్టి సారించాయి.
ఈ నేపథ్యంలోనే ఎలాగైనా తనకు కరీంనగర్ ఎంపీ సీటు వస్తుందనే ధీమాతో బండి ఉన్నారు.
ఎందుకంటే ఆయన ప్రతిసారి కరీంనగర్ నుండే పోటీ చేసి గెలుస్తున్నారు.కానీ ఈసారి బండి సంజయ్ సీటుకు ఈటెల ఎసరు పెట్టేలా ఉన్నారు.ఎందుకంటే తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడాలో వద్దో పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది.
ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమని పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా చేస్తాను.ఇక ఎక్కడినుండి చేయాలో అది అధిష్టానమే నిర్ణయిస్తుంది అని చెప్పారు.అయితే ఈయన చేసిన ఈ కామెంట్లు చూస్తే ఖచ్చితంగా బండి సిటు కి ఈటెల ఎసరు పెట్టేలా ఉన్నారని చాలామంది రాజకీయ విశ్లేషకులు, ప్రజలు భావిస్తున్నారు.