ఈటెల కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారంటూ ప్రచారం.. అసలు వాస్తవం ఇదే

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయం లో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడిగా వ్యవహరించిన ఈటెల రాజేందర్( Etela Rajender ) కాల క్రమేనా.రాజకీయ పరిస్థితుల కారణంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ని వదిలేసిన విషయం తెల్సిందే.

 Etela Rajender May Going To Congress Soon Says Political People ,etela Rajende-TeluguStop.com

ప్రస్తుతం బిజెపి లో ఉన్న విషయం కూడా తెలిసిందే బీఆర్ఎస్( BRS party ) నుండి ఈటెల రాజేందర్ ను అవమానకరంగా పంపించేశారు అంటూ చాలా మంది ఆయన మద్దతుదారులు ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉన్నారు.ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న బిజెపి లో కూడా ఆయనకు సమచిత గౌరవం దక్కడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Congress, Etela Rajendar, Revanth Reddy, Ts Congress, Ts-Politics

మొత్తానికి బిజెపి లో ఆయన ఎంత కాలం ఉంటాడు అనేది అనుమానమే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.ఈ నేపథ్యం లో ఈటెల రాజేందర్ మళ్లీ సొంత పార్టీ బీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ ఆ మధ్య ప్రచారం జరుగుతుంది.కానీ ఆ వార్తలను ఇటీవల సన్నిహితులు కొట్టి పారేశారు.ఇక ఆయనను రేవంత్ రెడ్డి( Revanth reddy ) కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాడు.

Telugu Congress, Etela Rajendar, Revanth Reddy, Ts Congress, Ts-Politics

ప్రస్తుతం బిజెపి లో చేరికల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈటెల రాజేందర్ ముందు ముందు కాంగ్రెస్ పార్టీ లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ స్వయంగా బిజెపి నాయకులు మాట్లాడుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.కాంగ్రెస్ నాయకులు కూడా చాలా మంది ఈటెల బిజెపి వదిలి తమ పార్టీ లోకి వస్తాడు అంటూ మాట్లాడుకుంటున్నారట.త్వరలోనే ఈటెల భవితవ్యం తేలే అవకాశం ఉంటుందని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు.కానీ ఈటెల రాజేందర్ మాత్రం తాను పార్టీ మారేది లేదని చెప్తున్నాడు.మళ్లీ మళ్లీ పార్టీ మారితే ప్రజల్లో విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుంది.కనుక ఈటెల బీజేపీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube