సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ( Akkineni Nagachaitanya ) ప్రస్తుతం తండేల్ ( Thandel )సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది తాజాగా ఈ సినిమా నుంచి ఎసెన్స్ ఆఫ్ తండేల్ అంటూ గ్లింప్స్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో నాగచైతన్య పూర్తిగా మాస్ లుక్ లో కనిపించారు.
ఇక ఈ సినిమాలో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ వీడియోలో నాగచైతన్య చెప్పినటువంటి డైలాగ్స్ కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.అలాగే దేశభక్తిని కూడా ఈయన చాటుకోవడం ఈ వీడియోలో చూపించారు.ఇక ఇందులో నాగచైతన్య ఈ పాలీ ఏటా గురి తప్పేదేలే అంటూ వేటకు వెళ్ళగా ఆయన బార్డర్ దాటి వెళ్లడంతో పాకిస్తాన్ అధికారులు తనని బంధిస్తారు.
అక్కడ పాకిస్తాన్ జైలులో ఉన్నప్పటికీ కూడా ఈయన దేశభక్తి చాటుకుంటూ మన జాతీయ పతాకం వేస్తూ ఉంటారు అనంతరం భారతదేశం నుంచి విడిపోయిన ముక్క పాకిస్తాన్ అంటూ చెప్పినటువంటి డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఇక ఈ వీడియో చివరిలో సాయి పల్లవి( Sai pallavi ) ని చూపించడం ఈ వీడియోకి హైలైట్ గా మారిపోయింది.పాకిస్తాన్ వాళ్లు నాగచైతన్యను బంధించడంతో సాయి పల్లవి తన రాక కోసం ఎదురుచూస్తూ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.ఇక వీడియో చివరిలో బుజ్జి తల్లి వస్తున్నాగదే కాస్త నవ్వు అనే డైలాగ్ రాగానే సాయి పల్లవి ఫేస్ రివిల్ చేస్తూ చూపించారు.
మొత్తానికి ఈ వీడియో ద్వారా సినిమా ఎలా ఉండబోతుందనే విషయాలన్నింటిని డైరెక్టర్ స్పష్టంగా చూపించారు.నాగచైతన్య ఈ సినిమా ద్వారా ఒక మాస్ హిట్ అందుకోబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది.







