మామూలుగా ఏదైనా పండగ వస్తే చాలు సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఆ పండుగ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అంతేకాకుండా సోషల్ మీడియాలలో పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు.
ఇక పండుగల సమయంలో పద్ధతిగా తయారయ్యి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు.అయితే ఎప్పుడూ గ్లామర్ షో చేసే వాళ్లు సైతం పద్ధతిగా తయారయ్యి షాక్ ఇస్తారు.
అయితే ఆ పద్ధతిగా తయారైన కూడా ఏదో ఒక చోట తమ అందాలను చూపించే ప్రయత్నం చేస్తారు.దీంతో పండుగ సమయంలో కూడా వాళ్లకు ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.
తాజాగా ఈషా రెబ్బాపై( Esha Rebba ) కూడా బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.
ఈరోజు ఉగాది ( Ugadi )సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ పండుగ వేడుకను సంతోషంగా జరుపుకుంటున్నారు.
సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తున్నారు.ఇక సోషల్ మీడియా వేదికగా ఉగాది శుభాకాంక్షలు అంటూ తెలుపుతున్నారు.ఇక ఈశా రెబ్బా కూడా అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపింది.
అంతకుముందు ఆ తర్వాత అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది.కానీ హీరోయిన్ గా అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
ఇక తన అందంతో మాత్రం ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.చాలా వరకు నటన పరంగా కంటే అందం పరంగా ఎక్కువ మార్కులు సొంతం చేసుకుంది.
ఇక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.
మొదట్లో ట్రెడిషనల్ లుక్( Traditional look ) లో తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ఇప్పుడు బాగా గ్లామర్ షో చేస్తూ కనిపిస్తుంది.అందం విషయంలో తన గ్లామర్ తో డోస్ పెంచింది.హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావట్లేదు.
అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా బాగా గ్లామర్ షో చేస్తూ కనిపిస్తుంది.ఇక అప్పుడప్పుడు తన ఇన్స్టా వేదికగా రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.
కొన్నిసార్లు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది ఈషా రెబ్బ.వాటిని కూడా అస్సలు పట్టించుకోదు.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.
అందులో ఉగాది పండుగ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు అంటూ తన ఫాలోవర్స్ కి తెలిపింది.ఇక తను చీర కట్టుకొని ఉండగా అందులో తన నడుము అందాలు కనిపించే విధంగా చూపిస్తూ పండుగ శుభాకాంక్షలు చెప్పటంతో అందరూ ఆమెపై ఫైర్ అవుతున్నారు.కాస్త పద్ధతిగా ఉండి శుభాకాంక్షలు చెప్పచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి కొంతమంది ఇలా షో చేయడం అవసరమా అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలిసింది.