జూనియర్ ఎన్టీఆర్( Jr.NTR ) ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.ఎందుకంటే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆయన తన సొంత టాలెంట్ తో ఎదిగి చూపించారు.అంతేకాదు అప్పటివరకు ఆయనను సూటిపోటి మాటలను అని పక్కనపెట్టిన వారే మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు.
అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి వేణు స్వామి ( Venuswamy ) ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా కచ్చితంగా ఆయనకు రాజయోగం పడుతుందని చెబుతారు.అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కి రాజయోగం పట్టడం ఖాయం కానీ ఆయన పుట్టుకలో ఓ దోషం ఉంది అంటూ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు.
ఇక విషయంలోకి వెళ్తే.సెలబ్రెటీల జాతకాలు చెబుతూ పాపులర్ అయిన వేణు స్వామి ఎన్టీఆర్ తల్లి శాలిని ( Shalini ) గారిని ఓసారి తిరుపతి దేవస్థానంలో కలిశారట.
అలా కలిసిన సమయంలో ఎన్టీఆర్ జాతకం చాలా అద్భుతంగా ఉంది రాజయోగం పడుతుంది అని వేణు స్వామి ఎన్టీఆర్ తల్లితో చెప్పారట.అయితే ఆయన మాటలు విన్న శాలిని గారు ఎన్టీఆర్ కి రాజయోగం పడుతుందని చెబుతున్నారు.
కానీ ఆయన జాతకంలో ఉన్న దోషం గురించి మీకు తెలియదా అని నన్ను ఒక ప్రశ్న అడిగింది.

దానికి నేను సమాధానంగా నాకు అన్నీ తెలుసమ్మా.ఆయన పుట్టుకలో ఉన్న దోషం కూడా నాకు తెలుసు.అంటూ చెప్పేసరికి శాలిని ఆశ్చర్యపోయింది.ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టుకలో దోషం ఉంది అనే సీక్రెట్ ఎన్టీఆర్ కి,శాలినికి, సీనియర్ ఎన్టీఆర్ ( SR.NTR ) కి తప్ప ఇంకొకరికి తెలియదు.అలాంటిది ఆ విషయం నాకు తెలియడంతో శాలిని షాక్ అయింది.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ ది మక నక్షత్రం అచ్చం ఈయనది కూడా జయలలిత ( Jayalalitha ) జాతకాన్ని పోలే ఉంటుంది.

ఇక ఈయన రాజకీయాల్లోకి వస్తే టాప్ పొజిషన్ లోకి వెళ్లడం ఖాయం.కానీ 2030 వరకు ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రానివ్వకండి అని నేను శాలిని గారితో చెప్పాను అంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ పుట్టుకలో ఉన్న దోష రహస్యం ఏంటో మాత్రం బయట పెట్టలేదు.







