సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.ఇప్పటికే పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుని చివరి ఎకరా వరకు నీరును అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ఛనాక – కొరాట బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించాయి.ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖకు అధికారికంగా అనుమతి సమాచారాన్ని పంపింది.కాగా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, బేలా మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది.







