పాఠశాలలో క్లాసులు వినాలంటే కొన్నిసార్లు విద్యార్థులకు చాలా కష్టంగా అనిపిస్తుంది.ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు ఒక్కోసారి వీరికి విసుగు తెప్పిస్తాయి.
కానీ కొంతమంది ఉపాధ్యాయులు తమ తరగతులను ఆహ్లాదకరంగా మార్చడానికి కొన్ని ఆకట్టుకునే పనులు చేస్తుంటారు.ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ మను గులాటి కూడా ఇలాంటి ఒక ఆకట్టుకునే పనిచేసి తమ విద్యార్థులకు క్లాస్ ను మరింత ఆహ్లాదభరితంగా మార్చింది.
ఆమె కొన్ని గ్రూవీ డ్యాన్స్ స్టెప్స్ తో తన క్లాసును ఉత్సాహపరిచింది.దీనికి సంబంధించిన వీడియోని ట్విటర్ లో షేర్ చేశారు.
ఇప్పుడు అది వైరల్ గా మారింది.
ఈ వీడియోలో గులాటీ తన విద్యార్థితో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు చూడొచ్చు.
ఒక స్టూడెంట్ తన డ్యాన్స్ స్టెప్పులను ప్రదర్శిస్తుండగా… గులాటీ టీచర్ వాటిని కాపీ చేసింది.స్టూడెంట్ కంటే ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసింది.తమ టీచర్ చక్కగా నాట్యం చేస్తూ ఉండటం చూసి ఇతర విద్యార్థులు చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా కనిపించారు.

ఈ వీడియో క్లిప్‌ను దాదాపు లక్ష వరకు వ్యూస్ వచ్చాయి.నెటిజన్లు ఈ టీచర్ ని పొగుడుతున్నారు.మీరు సూపర్ మేడం, పిల్లలతో ఇలానే ఫ్రెండ్లీగా ఉంటూ మంచిగా పాఠాలు చెప్పండి అని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.
తారే జమీన్ పర్ సినిమాలోని అమీర్ ఖాన్ రోల్ గుర్తుకొచ్చిందని కొంతమంది కామెంట్లు చేశారు.చాలా మంది గులాటీ తన క్లాసును ఉత్సాహంగా మార్చినందుకు కొనియాడారు.ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.







