ఈ కారు టైర్లు లేకుండానే దూసుకెళ్తుంది.. దీని హైట్ ఎంత తక్కువో తెలిస్తే..

సాధారణంగా ఏ వెహికల్ అయినా టైర్ లేకుండా నడవదు కానీ ఇటలీకి చెందిన ఫియట్ పాండా( Fiat Panda ) అనే కారు టైర్లు లేకుండా దూసుకెళ్తోంది.అందుకు అనుగుణంగా ఈ కారులో ప్రత్యేకమైన మార్పులు చేశారు.

 Engineers Modified Fiat Panda Car With Zero Ground Clearance Video Viral Details-TeluguStop.com

కారు టైర్లు తీసేసిన తర్వాత ఒక పైభాగాన్ని మాత్రమే నేలపై ఉంచినట్లు కనిపిస్తుంది.సింపుల్ గా చెప్పాలంటే అది రహదారిపై తేలియాడుతున్నట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే కారు దిగువ భాగాలన్నీ ఇంజనీర్లు తొలగించారు.ఈ కారు జీరో గ్రౌండ్ క్లియరెన్స్ తో( Zero Ground Clearance ) వస్తుంది.

కారులో పైకప్పు, హుడ్, కొన్ని ఇతర భాగాలను మాత్రమే వారు ఉంచారు.ఈ మిగిలిన భాగాలను మూడు చక్రాలు, ప్రత్యేక రకం ఇంజన్‌తో కూడిన ఫ్రేమ్‌కు జోడించారు.

కారు సజావుగా తిరుగుతుందని నిర్ధారించుకోవడానికి, వారు హుడ్‌కు చిన్న చక్రాలను జోడించారు.ఇంజన్‌ను కవర్ చేసే కారు ముందు భాగాన్నే హుడ్‌ అంటారు.

కారు నేల నుంచి చాలా తక్కువ ఎత్తు ఉన్నందున కారు నడుపుతున్న వ్యక్తి చెక్క దిమ్మెపై పడుకోవాలి.అతను కూర్చోవడానికి, కాళ్లు పెట్టుకోవడానికి కారులో తగిన స్పేస్ లేదు.కారు కిటికీలు చాలా డార్క్‌గా ఉన్నాయి, కాబట్టి లోపల చూడటం కష్టం.డ్రైవర్‌ ( Driver ) బయట వ్యూ చూడటానికి వీలుగా వారు ఫోన్‌కి కనెక్ట్ చేసిన చిన్న కెమెరాను ఉపయోగిస్తారు.

ఈ సవరించిన కారు నిజంగానే రోడ్లపైకి తీసుకొచ్చి నడుపుదామంటే కుదరని పని.

కానీ సేఫ్టీ ప్రదేశాలలో దీనిని నడుపుతూ ఎంజాయ్ చేయవచ్చు.అసలైన ఫియట్ పాండా కారుకు నివాళిని అర్పించడానికి ఈ కారును ఇంజనీర్లు తయారు చేశారు.దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

ఇది చూసి చాలా మంది నెటిజన్లు ఇది నిజంగా కారేనా, లేదంటే గేమ్‌లో ఒక గ్లిచ్ వల్ల కనిపిస్తున్న కారా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఏదేమైనా ఈ డిజైన్ చాలా క్రేజీగా ఉంది అందరినీ ఆశ్చర్యపరిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube