హైదరాబాద్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రేవ్ పార్టీ

హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఇంజనీరింగ్ విద్యార్థులు రేవ్ పార్టీని నిర్వహించారు.బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలుస్తోంది.

 Engineering Students Rave Party In Hyderabad-TeluguStop.com

సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో పార్టీలో నిషేధిత గంజాయిని వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

రేవ్ పార్టీలో పాల్గొన్న 29 మంది యువకులతో పాటు నలుగురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అదేవిధంగా 50 గ్రాముల గంజాయితో పాటు 11 కార్లు, ఒక బైకు, 28 మొబైల్స్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం స్టూడెంట్స్ కు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు వారిని వదిలివేశారని సమాచారం.మళ్లీ విచారణకు రావాలని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube