Emirates Air Hostess : విజన్ ప్రో హెడ్‌సెట్‌ తొడుక్కున్న ఎమిరేట్స్ ఎయిర్ హోస్టెస్.. ఆమె రియాక్షన్ ఏంటంటే..

యాపిల్ సంస్థ తెచ్చిన కొత్త వీఆర్ హెడ్‌సెట్‌ “విజన్ ప్రో( Apple Vision Pro ) ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.ప్రతిచోటా ప్రజలు ఈ అడ్వాన్స్‌డ్‌ డివైజ్ గురించి బాగా తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు.

 Emirates Air Hostess Wearing Vision Pro Headset Her Reaction Is-TeluguStop.com

దీనిని కొనుగోలు చేసిన వారు పబ్లిక్‌గా ఉపయోగిస్తూ అందరినీ తమ వైపు తిప్పుకుంటున్నారు.ఒక వ్యక్తి ఇటీవల విమానంలో ప్రయాణిస్తూ దీనిని వాడుతూ కనిపించగా దానిని చూసి ఎమిరేట్స్ ఫ్లైట్ అటెండెంట్ ముచ్చట పడింది.

అది ఎలా ఉందో చెప్పాలని అడిగింది.అయితే ప్యాసింజర్ బదులు ఇస్తూ “ఎలా ఉందో నువ్వే చూడొచ్చు కదా, ట్రై చెయ్ ఏం కాదు.” అని ఒప్పించాడు.దాంతో మొదటిసారిగా ఆమె విజన్ ప్రోని ధరించి అద్భుతమైన అనుభూతిని అనుభవించింది.

ఆమె విజన్ ప్రో హెడ్‌సెట్‌ ట్రై చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ వీడియోను ఇటాలియన్ డిజిటల్ క్రియేటర్ ఒట్టో క్లైమాన్ ( Otto Climan )ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

వీడియోలో ఎమిరేట్స్ ఎయిర్ హోస్టెస్( Emirates Air hostess )విజన్ ప్రోని చూసి ఆశ్చర్యంగా, థ్రిల్‌ అయినట్టు కనిపించింది.ఆమె ఇంతకు ముందు దీనిని ఆన్‌లైన్‌లో మాత్రమే చూసింది, ఇటీవల ఆమె నిజ జీవితంలో తాను పనిచేస్తున్న విమానంలోనే దీనిని చూసింది.క్లైమాన్‌ ప్యాసింజర్ దీనిని విమానంలో ఉపయోగిస్తూ కనిపించాడు.మొదట, ఆమె దీన్ని ప్రయత్నిస్తానని అనుకోలేదు.పరికరం గురించి ఏమనుకుంటున్నారో చెప్పాలని క్లైమాన్‌ను ప్రశ్నించింది.కొంత ప్రోత్సాహం తర్వాత, దానిని స్వయంగా ప్రయత్నించాలని నిర్ణయించుకుంది.

విజన్ ప్రో అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉందని ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో పైగా వ్యూస్ వచ్చాయి.ఫ్లైట్ అటెండెంట్ పనిచేసే విమానయాన సంస్థ ఎమిరేట్స్ కూడా ఈ వీడియోను చూసి, విజన్ ప్రోని తాము కూడా ప్రయత్నించాలనుకుంటున్నట్లు సరదాగా వ్యాఖ్యానించింది.ఈ వీడియోపై ప్రజలు భిన్నమైన స్పందనలను వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లైట్ అటెండెంట్ చాలా ఫ్రెండ్లీగా అనిపించిందని ఓ వ్యక్తి చెప్పాడు.మరొక వ్యక్తి ఇలాంటి పని చేయడం వల్ల ఉద్యోగాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉందని ఇంకొందరు హెచ్చరించారు.

ఈ డివైజ్ లోని బ్రౌజర్ హిస్టరీ హ్యాపీగా ఉంటే ఆమె భయపడిపోయేదేమో అని ఇంకొందరు ఫన్నీగా కామెంట్లు పెట్టారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube