ఎమర్జెన్సీ పవర్ బ్యాంక్ ఇన్ వాకింగ్.. బీహార్ విద్యార్థి పై ప్రశంసల వర్షం..!

ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరుగుతూ పోతోంది.అయితే కొంతమంది విద్యార్థులు యూట్యూబ్ ను ఫాలో అవుతూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.

 Emergency Power Bank In Walking Shower Of Praise On Bihar Student ,bihar , Madhe-TeluguStop.com

స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ప్రాక్టికల్ సబ్జెక్ట్ ( Practical subject )పై అవగాహన పెంచుకోవడం అనేది కొత్త కొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తోంది.ఇంటర్నెట్ వాడకం పెరిగిన క్రమంలో ఏ విషయం అయినా సులభంగా తెలుసుకోవచ్చు.

అయితే బీహార్ మాధెపురా కు చెందిన ప్రాంజల్ ( Prangle )అనే పదవ తరగతి విద్యార్థి కాలినడకన నడిస్తే కరెంటు ఉత్పత్తి అయ్యే పరికరాన్ని తయారుచేసి, గౌహతి లో ఇటీవలే జరిగిన జాతీయ బాలల సైన్స్ ఎగ్జిబిషన్లో( National Children’s Science Exhibition ) ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందాడు.ఈ డివైజ్ తయారు చేయడం కోసం దాదాపుగా నాలుగు సంవత్సరాలు పట్టింది.

ఈ డివైజ్ తయారు చేయడం కోసం యూట్యూబ్లో నిరంతరం కావలసిన సమాచారం తెలుసుకొని తయారుచేసినట్లు ఫ్రాంజల్ తెలిపాడు.ఎన్నోసార్లు ప్రయోగం ఫెయిల్ అయినా కూడా పట్టు వదలకుండా ఎట్టకేలకు ఈ డివైజ్ రూపొందించాడు.

ఈ డివైజ్ ను ఇంట్లో వాడిన పనికి రాని పైపు ముక్క, బట్టలు కుట్టేటప్పుడు ఉపయోగించే బెల్టు సహాయంతో తయారుచేశాడు.దీని తయారీకి రూ.1,300 ఖర్చు అయ్యింది.సైన్యం అవసరాలను దృష్టిలో పెట్టుకుని మారుకూర ప్రాంతాల్లో ఉండే సైనికుల కోసం ఈ డివైజ్ రూపొందించానని తెలిపాడు.

ఈ డివైజ్ తో మొబైల్ ఫోన్, వాకి టాకీ వంటి స్మార్ట్ పరికరాలకు చార్జింగ్ పెట్టుకోవచ్చు.మారుమూల ప్రాంతాల్లో కరెంటు సౌకర్యాలు దాదాపుగా ఉండని క్రమంలో చార్జింగ్ కోసం కష్టాలు తప్పవు.అటువంటి సందర్భంలో ఈ డివైజ్ తో చార్జింగ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.ఇక ప్రాంజల్ కు సహాయం చేసిన జూనియర్ సైంటిస్ట్ ఆనంద్ విజయ్ ఈ పరికరాన్ని మరింత మెరుగు గా తయారు చేయవచ్చని చెప్పాడు.

ఈ డివైజ్ కు ఎమర్జెన్సీ పవర్ బ్యాంక్ ఇన్ వాకింగ్ అని పేరు పెట్టినట్లు ప్రాంజల్ తండ్రి సమీర్ దాస్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube