షాక్ ఇచ్చిన ఎలన్ మస్క్.. ఇకనుండి వారు డబ్బులు చెల్లిస్తే తప్ప, ఉచితంగా ట్విటర్ లభించదు!

ట్విటర్ అంటే ఏమిటో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.మనలో చాలా మంది ట్విటర్ విరివిగా వాడుతున్నారు.

 Elon Musk Says Twitter Will Charge Slight Fee For Commercial And Government User-TeluguStop.com

న్యూస్, ఎంటర్టైన్మెంట్, ప్రముఖుల గురించి సమాచారంతో పాటు అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ట్విటర్‌ నే ఎక్కువగా ఫాలో అవుతారు.ఎలన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తరువాత పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

బేసిగ్గా ఇప్పటి వరకు అందరికీ ఉచితంగానే ట్విటర్ సర్వీసులు లభించేవి.ఇకనుండి అలా ఉండదు.

ట్విటర్ అందరికీ ఉచితం కాదని, ట్విటర్ ఖాతా కలిగిన వాణిజ్య వినియోగదారులు, ప్రభుత్వ సంస్థలు ఇక నుంచి ఫీజు చెల్లించాల్సిందేనని ట్విటర్ తాజా CEO ఎలన్ మస్క్ స్పష్టం చేశారు.

అయితే ఈ ఫీజు అనేది చాలా స్వల్ప మొత్తంలో ఉంటుందని చెప్పడం ఇక్కడ గమనార్హం.

ఇక సాధారణ వినియోగదారులు మాత్రం సింగిల్ రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.ఎప్పటిలానే ట్విటర్‌ను వారు ఉచితంగా వాడుకోవచ్చు.ఇక ఇటీవల ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ వ్యవస్థాపకు, స్పేస్ ఎక్స్ CEO అయిన ఎలాన్ మస్క్‌తో ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.మొత్తం 44 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.3.30 లక్షల కోట్లు వెచ్చించి, మస్క్ ట్విటర్ దక్కించుకున్నారు.

ఇక ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వెళ్లిన తర్వాత.అందులో ఎన్నో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి.వాక్ స్వాతంత్య్రానికి మరింత అనువైన వేదికగా ట్విటర్ ను తీర్చిదిద్దుతానని, కొత్త ఫీచర్లను తీసుకొస్తానని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు.ఇకపోతే ఈ విషయం మీద నెటిజన్స్ మిశ్రమ స్పందనను తెలియజేస్తున్నారు.

మంచి పని కొంతమంది అంటే, మరి కొంతమంది మాత్రం అలాగైతే మీరు ఫాలోయర్స్ సంఖ్యను కోల్పోతారని వ్యాఖ్యలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube