గమ్మత్తైన అతిధి: విందులో భోజనం చేస్తుండగా నోరు తుడుచుకోవడానికి ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు!

మన దగ్గర పెళ్లిళ్ల సందళ్ళు షురూ అయ్యాయి.సమ్మర్ అంటేనే పెళ్లిళ్ల వాకిలి.

 Funny Man Uses Roti As Tissue Paper To Clean Face In A Wedding Viral Video Detai-TeluguStop.com

ఇంకేముంది పెళ్లిళ్ల మండపాలలో రకరకాల సన్నివేశాలతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఇక్కడ చాలామంది పెళ్లిళ్లకు వెళ్లాలంటే ఉత్సాహం చూపుతారు.

రకరకాల తినుబండారాలు ఉంటాయి కనుక.ఓ రకంగా చెప్పాలంటే పంచ భక్ష్య పరమాన్నాలు ఇక్కడే దొరుకుతాయి.

అంతేకాకూడా ఆటలు పాటలతో సందడి చేస్తారు.కొంతమంది తమలో ఉన్న స్కిల్స్‌ని బయటకు తీసి పదిమంది ముందు ప్రదర్శిస్తూ.

సందడి వాతావరణం సృష్టించే సీజన్‌ ఇది అని చెప్పుకోవచ్చు.

ఇకపోతే, సాధారణంగా పెళ్లి వేడుకలలో అతిముఖ్యమైన అంశం ఆహారం.

తమ వివాహాలలో ఫుడ్ మెనూలో చాలా వస్తువులను చేరుస్తూ తమ హోదాని కూడా కొంతమంది ప్రదర్శిస్తారు.చాలా మంది పెళ్లి వేడుకలకు వెళ్ళేది.

రకరాల ఫుడ్ ఐటెమ్స్ ను తినడం కోసమే అని కూడా చెప్పవచ్చు.తాజాగా ఫుడ్‌కి సంబంధించిన చాలా ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూస్తే మీరు తెగ నవ్వుకుంటారు.దానికి మాది ఫుల్ గ్యారంటీ.

అక్కడ వేడుకలో భాగంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.అక్కడ అమర్చిన రౌండ్ టేబుల్‌పై కొంతమంది ఆహారం తింటున్నారు.

ఎవరి తిండి ధ్యాసలో వారున్నారు.ఇంతలో ఒక వ్యక్తి ఆహారం తింటూ ఉండగానే నోరు తుడుచుకోవాలనుకున్నట్లున్నాడు.దాంతో అటు ఇటు చూసి, టిస్యూస్ లేవని తెలుసుకున్నాక, అక్కడ ప్లేట్ లో ఉన్న ఓ రోటీని తీసుకుని టిష్యూ పేపర్‌గా ఉపయోగిస్తూ.నోరు తుడుచుకున్న తర్వాత మెల్లగా బయట పడేసాడు.

సదరు వీడియోని చుసిన తరువాత ఒక్కసారిగా మాకైతే నవ్వు ఆగలేదు.ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ensen4947 అనే IDతో షేర్ చేశారు.

మీరు కూడా ఓసారి లుక్కేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.ఇప్పటివరకు దీనికి 16 లక్షల వ్యూస్, 12 వేల లైక్స్ రావడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube