లంచాలకు, అవినీతికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా పింఛన్లు

లంచాలకు, అవినీతికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా పింఛన్లు ఎమ్మెల్యే పేర్ని నాని లంచాలకు, అవినీతికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిజాయతీగా నిస్పక్షపాతంగా లబ్ధిదారులకు అందచేస్తుందని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.

 Eligible Pensions Are Free From Bribery And Corruption ,mla Perni Nani,eligible-TeluguStop.com

శుక్రవారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన వైఎస్‌ఆర్‌ పింఛను కానుక కార్యక్రమానికి హాజరయ్యారు.

మచిలీపట్నం రూరల్ 34 గ్రామ పంచాయతీలకు సంబంధించి 397 నూతన పింఛన్లను లబ్ధిదారులకు నేరుగా వారి వద్దకే వెళ్లి కొత్త పింఛనుదారులకు పింఛను మంజూరు పత్రాలు, అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ, ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

మచిలీపట్నం నియోజకవర్గంలో 30 వేల కొత్త, పాత పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు.

అర్హత ఉన్న ప్రతి పేదవాడికి తప్పనిసరిగా పింఛను వచ్చేలా పనిచేస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటికి వచ్చి పింఛను ఇచ్చే రోజులు ఉన్నాయా? అని ప్రజలను ఎమ్మెల్యే పేర్ని నాని అడిగారు.గత ప్రభుత్వంలో పింఛన్‌ కావాలన్నా, ఒక రేషన్‌ కార్డు రావాలన్నా లంచం ఇస్తే గాని పని జరిగేది కాదన్నారు.

అలాంటిది వైసిపి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు, పింఛన్లు, రేషన్‌ కార్డులు వంటివి ఏవైనా లంచాలకు, అవినీతికి తావు లేకుండా అందజేస్తున్నారని పేర్కొన్నారు.

మచిలీపట్నం నియోజకవర్గంలో 397 నూతన పింఛన్లలో లబ్ధిదారులకు సుమారు 12 లక్షల రూపాయలను మొత్తాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు.

గ్రామాల వారీగా పరిశీలిస్తే, శుక్రవారం రోజున అరిసెపల్లిలో 11, భోగిరెడ్డిపల్లిలో 8, బొర్రపోతుపాలెంలో 6, బుద్ధాలపాలెంలో 7, చిన్నాపురం గ్రామంలో 36, నెలకుర్రులో 11, గరాలదిబ్బ లో 2, గుండుపాలెంలో 9, గోకవరంలో 3 , చిరివేళ్లపాలెంలో 6, కరగ్రహారం లో 22, చిన కరగ్రహారంలో 8, కానూరు 7 , కోన గ్రామంలో 16 , మంగినపూడిలో 4 , మేకావానిపాలెంలో 12, గోపువానిపాలెంలో 7, ఎన్.గొల్లపాలెంలో 15, తుమ్మలచెరువు గ్రామంలో 6 , పోలాటితిప్ప లో 11, పల్లె తుమ్మలపాలెంలో 8, పెదయాదర గ్రామంలో 20, పెదపట్నంలో 4, పోతేపల్లి గ్రామంలో 6 , పోతిరెడ్డిపాలెంలో 7, పొట్లపాలెంలో 8 , రుద్రవరంలో 11, ఎస్ ఎన్ గొల్లపాలెంలో 16, సీతారామాపురం 11, సుల్తాన్ నగరం 10, తాళ్లపాలెం గ్రామంలో 51, వాడపాలెం 28, కె పి టి పాలెం గ్రామంలో 10 కొత్తగా పింఛన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కష్టకాలంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా యథావిధిగా కొనసాగిస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా 62 లక్షల పింఛన్లు నేడు 64 లక్షలకు పెంచిన ఘనత ఆయనదేనని తెలిపారు.ఆర్ధికంగా సామాజికంగా దెబ్బతిన్నవారికి ఆసరాగా పింఛన్ల పంపిణి కార్యక్రమం మహోన్నతమైనదిని ప్రతి నెల 1 వ తారీఖున లబ్ధిదారుని ఇంటి ముంగిటనే ఆ నగదును అందించడం గొప్ప మానవీయత అని అన్నారు.

ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు చాలా కష్టపడి పనిచేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డ్వామా పిడి జి వి సూర్యనారాయణ, మచిలీపట్నం మాజీ జెడ్పిటిసి లంకే వెంకటేశ్వరరావు ( ఎల్వీయార్ ) పలు గ్రామాల సర్పంచులు వైసిపి నాయకులు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube