గున్న ఏనుగు ప్రాణాలను కాపాడిన సిబ్బంది.. చూస్తే వావ్ అనాల్సిందే!

గున్న ఏనుగులు భలే ముద్దుగా ఉంటాయి.అవి చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి.

 Elephant And Its Calf Which Fell Into A Drain Rescued In Thailand Elephant , Res-TeluguStop.com

బుచ్చి బుచ్చి కాళ్లతో అలా అలా గెంతుతుంటే సరదాగా ఉంటుంది.చిన్న తొండంతో అవి ఆడే ఆటలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంద.

కానీ ఆ గున్న ఏనుగులు బాధతో విలవిల్లాడిపోతుంటే… చూసి తట్టుకోలేము.నొప్పితో ఏడుస్తుంటే.

మన గుండె స్రవిస్తుంది.థాయ్ లాండ్ లో జరిగిన ఓ ఘటన నెటిజన్లను మెలిపెడుతోంది.

అయితే ఆ గున్న ఏనుగును కాపాడిన సిబ్బందిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.అసలేం జరిగిందంటే.

థాయ్ లాండ్ నఖోన్ నాయొక్ రాష్ట్రంలోని ఖావో యాయ్ జాతీయ పార్కు అది.ఆ పార్కులో ఓ భారీ గుంతలో ఏడాది వయసున్న గున్న ఏనుగు పడి పోయింది.దాన్ని బయటకు తీసేందుకు తల్లి ఏనుగు ఎన్నో ప్రయత్నాలు చేసింది.శాయశక్తులా ప్రయత్నించింది.పిల్ల ఏనుగులు బయటకు తీసుకురావాలన్న తపనతో చాలా పాట్లే పడింది.కానీ వర్షం, బురద కారణంగా దాని ప్రయత్నాలు ఫలించలేదు.

ఈ క్రమంలోనే దాన్ని కాపాడేందుకు జంతు సంరక్షకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఇది గమనించి తల్లి ఏనుగు… మరింత ఆందోళనకు గురైంది.

రెస్క్యూ ఆపరేషన్ ను అడ్డగించింది.దీంతో సిబ్బంది.

ట్రాంక్విలైజర్ లు ఉపయోగించారు.దీంతో తల్లి ఏనుగు స్పృహ కోల్పోయింది.

గుంత పక్కనే పడిపోయింది.తల్లి ఏనుగు కూడా కాస్త గుంతలోకి జారింది.

దానికి తాళ్లు కట్టి.క్రేన్ సాయంతో బయటకు లాగారు.

ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఏనుగుపైకి కొంత మంది ఎక్కి సీపీఆర్- కార్డియోపల్మనరీ రెసస్కిటేషన్ చికిత్స చేశారు.అప్పటికే పిల్ల ఏనుగు బయటకు వచ్చేందుకు వీలుగా గుంతను తవ్వారు.

చివరకు అది బయటకు వచ్చింది.మరో వైపు తల్లి ఏనుగు కూడా స్పృహ లోకి వచ్చింది.

తర్వాత అవి రెండూ కలిసి అడవిలోకి వెళ్లి పోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube