ఎన్నికలే జీవితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు.
ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలందరికీ మార్గనిర్దేశం చేసిందని మోదీ తెలిపారు.ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
నిన్న ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారన్న మోదీ నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని వెల్లడించారు.దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు దేశ భవిష్యత్ కు పునాదని వ్యాఖ్యనించారు.
దేశంలో అవినీతిని తరిమికొట్టామని చెప్పారు.ప్రపంచం అంతా భారత్ పట్ల పాజిటివ్ గా ఉందని, పొరుగు దేశాల్లో పరిస్థితి భయానకంగా ఉందని తెలిపారు.