సార్వత్రిక ఎన్నికల( General Elections ) నగారా మోగింది.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) మొత్తం ఏడు దశల్లో పోలింగ్ ను నిర్వహించనుంది.ఇందులో భాగంగా ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ మొత్తం 102 పార్లమెంట్ స్థానాలకు జరగనుంది.89 పార్లమెంట్ స్థానాలకు ఏప్రిల్ 26వ తేదీన రెండో దశ పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.94 పార్లమెంట్ స్థానాలకు మే 7వ తేదీన మూడో దశ., 96 పార్లమెంట్ స్థానాలకు మే 13న నాలుగో దశ పోలింగ్ జరగనుంది.49 పార్లమెంట్ స్థానాలకు మే 20న ఐదో దశ పోలింగ్, 57 పార్లమెంట్ స్థానాలకు మే 25న ఆరో దశ పోలింగ్ జరగనుంది.
అదేవిధంగా చివరిగా 57 పార్లమెంట్ స్థానాలకు జూన్ ఒకటోవ తేదీన ఏడో దశ పోలింగ్ ను ఎన్నికల సంఘం నిర్వహించనుంది.ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.కాగా ఏపీ, తెలంగాణ( AP, Telangana )లో ఒకే రోజు పోలింగ్ జరగనుందని ఈసీ తెలిపింది.
ఈ నేపథ్యంలో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ 4న కౌంటింగ్ ను ఈసీ నిర్వహించనుంది.