తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ( BRS, BJP ) చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీఎం కేసీఆర్ డ్రామాలను ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.తెలంగాణకు ఈడీ, మోదీ కలిసే వచ్చారన్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటంతో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని పేర్కొన్నారు.లిక్కర్ కేసులో బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయన్న రేవంత్ రెడ్డి 2023 లో లిక్కర్ డ్రామా మొదలైందని తెలిపారు.
తమ ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్, బీజేపీ వాళ్లు అన్నారని పేర్కొన్నారు.తాము అనుకుంటే బీఆర్ఎస్ లో ముగ్గురే మిగులుతారని తెలిపారు.
ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేయడం ఏంటన్న రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు.కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఢిల్లీకి వెళ్లలేదో చెప్పాలన్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్( Congress ) ను దొంగదెబ్బ తీసేందుకు కేసీఆర్, మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.