కేంద్రానికి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.వాట్సాప్ వేదికగా పంపిస్తున్న విక్షిత్ భారత్ మెసేజ్( Viksit Bharat messages ) లను వెంటనే నిలిపివేయాలని సూచించింది.
ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులో ఉన్న నేపథ్యంలో విక్షిత్ భారత్ మెసేజ్లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.అనంతరం దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర సమాచార శాఖను ఈసీ( Election Commission ) ఆదేశించింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత కూడా వికసిత భారత్ మెసేజ్లు వస్తున్నాయంటూ ఈసీకి ఫిర్యాదులు వచ్చాయి.దీంతో ఈసీ మెసేజ్లను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.







