Chiranjeevi : చిరంజీవి ఎందుకు ఈ పాత్రను రిజెక్ట్ చేశాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ గా చిరంజీవి( Chiranjeevi ) ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది మనందరికీ తెలిసిందే…వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ సుప్రీం హీరోగా ఎదిగిన చిరంజీవి.

 Do You Know Why Chiranjeevi Rejected This Role-TeluguStop.com

అక్కడినుంచి మెగాస్టార్ గా కూడా తన తాను మలుచుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే దర్శకధీరుడు గా గుర్తింపు పొందిన రాజమౌళి మగధీర సినిమాలో చిరంజీవి కోసం ఒక స్పెషల్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారట.

అయితే చిరంజీవి అప్పుడు పాలిటిక్స్ లో బిజీగా ఉండడంవల్ల తను ఆ పాత్ర ను చేయలేను అని చెప్పడంతో ఆ క్యారెక్టర్ ని సినిమాలో నుంచి తీసేసినట్టుగా రాజమౌళి ఒక సందర్భంలో చెప్పాడు.

 Do You Know Why Chiranjeevi Rejected This Role-Chiranjeevi : చిరంజీ-TeluguStop.com
Telugu Allua Ravind, Chiranjeevi, Kajal Aggarwal, Magadheera, Rajamouli, Ram Cha

అయితే అది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావడంతో చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిద్దామనుకున్నాడట … కానీ చిరంజీవి అప్పుడు ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయడంతో రాజమౌళి( Rajamouli ) సినిమా నుంచి ఆ క్యారెక్టర్ ని తీసేశాడు.ఒకవేళ చిరంజీవి కనక ఆ క్యారెక్టర్ చేసినట్లయితే చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోయేదని ఒకానొక సందర్భంలో రాజమౌళి చెప్పడం విశేషం.అంత గొప్ప క్యారెక్టర్ ని చిరంజీవి వదిలేయడం వల్ల మెగా అభిమానులు కూడా చాలా వరకు నిరాశ చెందారనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా( Vishwambhara )లో నటిస్తున్నాడు.

Telugu Allua Ravind, Chiranjeevi, Kajal Aggarwal, Magadheera, Rajamouli, Ram Cha

ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక దానికోసమే వర్కౌట్స్ కూడా చేస్తూ 70 సంవత్సరాల వయసులో కూడా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు…ఇక ఈ సినిమా కనక హిట్ అయితే చిరంజీవి మరోసారి భారీ కలెక్షన్స్ ను వసూలు చేయడం పక్కా అంటూ అభిమానులు కూడా వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube