తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో సోషల్ మీడియాపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు ప్రత్యేక వింగ్ ను ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది.
అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ఈసీ నిఘా పెట్టింది.ఈ క్రమంలోనే గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ పై దృష్టి సారించిన ఈసీ ఆ సంస్థలతో చర్చలు జరిపింది.
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా, ఇతర వర్గాలను కించపరిచే విధంగా చేసే పోస్టులను స్కాన్ చేయనున్నారు అధికారులు.ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరికలు జారీ చేసింది.







