ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి( AP Congress Leader Raghuveera Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రచారాన్ని అనంతపురం జిల్లా నుంచే ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ మేరకు ఈనెల 26వ తేదీ నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరియు మాణిక్కం ఠాగూర్( Manickam Tagore ) తో కలిసి ప్రచారాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.ప్రాంతీయ పార్టీలు ఏపీని నాశనం చేశాయన్న ఆయన పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదా వంటి అంశాలతో మ్యానిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
ఖూనీలు చేసే వారు కూడా తమ పార్టీ గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.







