ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మూడో ఛార్జ్‎షీట్‎లో కీలక విషయాలు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మూడో ఛార్జ్‎షీట్‎లో కీలక విషయాలు వెల్లడించింది.అరుణ్ పిళ్లై, కవితకు సంబంధించిన కీలక అంశాలను ఛార్జ్‎షీట్‎లో పేర్కొంది.

దాదాపు రూ.100 కోట్ల ముడుపులు హవాలా ద్వారానే జరిగాయని ఈడీ తెలిపింది.మనీ లాండరింగ్, హవాలా వ్యవహారాల్లో కవిత కీలకంగా వ్యవహరించారని ఈడీ పేర్కొంది.

అదేవిధంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కవిత సమావేశమయ్యారన్న ఈడీ కవితకు ప్రతినిధిగా అరుణ్ పిళ్లై, రాఘవకు ప్రతినిధిగా ప్రేమ్ మండూరి ఉన్నారని వెల్లడించింది.అరుణ్ పిళ్లైకి కవితనే డబ్బు సమకూర్చిందని పేర్కొంది.మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన రూ.192 కోట్లతో హైదరాబాద్ లో భూములు కొనుగోలు చేశారంది.ఛార్జ్‎షీట్‎లో కవిత భర్త అనిల్ పేరును కూడా ఈడీ ప్రస్తావించింది.

అప్పుడు 100 రూపాయలు.. ఇప్పుడు రూ.300 కోట్లు.. బన్నీ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు