ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.
నవంబర్ 10న ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులు అరెస్ట్ అయ్యారు.వీరు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
సౌత్ గ్రూప్ లావాదేవీల్లో కీలక వ్యక్తులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, విజయ్ నాయర్, బినోయ్ బాబులతో పాటు మొత్తం 12 మందిపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.







