తాలిబాన్ అధికారంలోకి రావడంతోనే ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణ స్థితికి దిగజారింది.ఇప్పుడు మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా ఇదే పరిస్థితి రాబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం పాకిస్తాన్‌లో తినడానికి తిండిలేదు.అలాగే దేశంలోని ప్రజలు జీవించడానికి అవసరమైన కనీస అవసరాలను అందించడానికి ప్రభుత్వ ఖజానాలో తగినంత డబ్బు లేదు.ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయి ఒక్కరోజు తిండి కోసం ఒకరినొకరు చంపుకునేంత దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.3 వేలకు 20 కిలోల ఆటా(గోధుమ పిండి)పాకిస్థాన్‌లో గోధుమ పిండి ధర అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.పాకిస్థాన్ చరిత్రలో తొలిసారిగా 20 కిలోల గోధుమ పిండి ధర రూ.3 వేలకు చేరింది.20 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ ధర రూ.1200గా ప్రభుత్వం నిర్ణయించింది.అయితే ఇప్పటికీ బహిరంగ మార్కెట్‌లో 20 కేజీల గోధుమ పిండి రూ.3,100కు లభిస్తోంది.లాహోర్‌లో కిలో రూ.150 పెరిగిన తర్వాత ఇప్పుడు 15 కిలోల పిండిని రూ.2,050కి విక్రయిస్తున్నారు.ఇప్పటి వరకు కేవలం రెండు వారాల వ్యవధిలోనే 15 కిలోల పిండి ధర రూ.300 మేరకు పెరిగింది.
ఒక నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో గోధుమ సంక్షోభం కూడా తీవ్ర ఆందోళనకు కారణంగా మారింది.దేశంలోని అనేక ప్రాంతాల్లో గోధుమ సంక్షోభం మరింత తీవ్రమైంది.అది ఎక్కడకు చేరిందంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పాకిస్థాన్ ప్రజల ప్లేట్‌లో రొట్టెలు కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది.
ప్రాణం తీసిన గోధుమ పిండినివేదికల ప్రకారం, సింధ్ ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి సబ్సిడీ గోధుమ పిండి ప్యాకెట్‌ను పొందడానికి ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోయాడు.గోధుమ పిండి ప్యాకెట్లతో కూడిన కొన్ని వాహనాలు ఇక్కడికి చేరుకున్నాయి.
దీంతో గోధుమపిండి కోసం పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.అయితే ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు కూడా వార్తలు వచ్చాయి.
చికెన్ ధర రూ.600ను దాటేసందిశ్రీలంక మాదిరిగానే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కూడా గడ్డు దశలో ఉంది.పాకిస్థాన్‌లో చికెన్, మాంసం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి.
డాన్ వార్తా సంస్థ నివేదికను పరిశీలిస్తే.పాకిస్థాన్‌లో చికెన్ కిలో రూ.650 వరకు విక్రయిస్తున్నారు.పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో కిలో రూ.800కు చేరుకోవచ్చు.ఎల్‌పీజీ గ్యాస్ గురించి మాట్లాడితే, వాణిజ్య గ్యాస్ సిలిండర్ 10 వేల పాకిస్తాన్ రూపాయలకు అందుబాటులో ఉందని తెలిస్తే ఎవరైనా సరే కంగుతింటారు.