3 నెలలలో మీకు నచ్చే 'ఎకో ఫ్రెండ్లీ' హౌజ్ రెడీ.. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటుంది!

ఓ సాధారణ ఇల్లు నిర్మాణం చేపట్టేటప్పుడు కర్బన ఉద్గారాలు అనేవి వెలువడటం, తద్వారా వాతావరణ కాలుష్యం కొంతవరకు జరగడం సహజమే.ఇలా వాతావరణ మార్పులకు భావన నిర్మాణాలే ప్రధాన కారణమని తెలుసుకున్న ఓ ఇద్దరు స్నేహితులు ఎకో ఫ్రెండ్లీ ఇండ్లను అందించే లక్ష్యంతో ‘ఓక్నో మోడ్‌హోమ్‌’ పేరుతో ఓ స్టార్టప్ స్టార్ట్ చేసారు.

 Eco Friendly Okno Modhomes In 90days, Okno Modhomes,eco Friendly House, Pine, 90-TeluguStop.com

వీరు సిమెంట్, కాంక్రీట్ లేకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు.మార్చి 2021లో ‘ఓక్నో మోడ్‌హోమ్స్‌’ను ప్రారంభించిన వీరు.

నిర్మాణ రంగ పరిష్కారాల కోసం వివిధ ఫ్యాక్టరీలను, అనేక మంది పారిశ్రామిక నిపుణులను కలిసి మేలైన సమాజం కోసం పర్యావరణ కాలుష్యానికి మేలు చేకూరే విధంగా ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నారు.

ప్రస్తుతానికి వెకేషన్ హోమ్స్‌ మాత్రమే వీరు డిజైన్ చేస్తున్నారు.

ఇవి చూడటానికి చాలా అందంగా కూడా ఉంటాయి.ఇలాంటి ఇల్లు కావాలంటే ముందుగా మేకర్స్‌ వద్ద అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

వీరు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఆర్డర్ ఇచ్చిన 90 రోజుల్లోనే ఇంటిని సిద్ధం చేసి చివరి వారంలో ఆన్-సైట్‌లో అసెంబ్లింగ్ చేస్తారు.ఇంతవరకు కర్ణాటకలోని చిక్ మగళూరులో ఒకటి, హైదరాబాద్‌లో 3 ఇళ్లను ఈ కంపెనీ నిర్మించడం విశేషం.

వీటికోసం పాశ్చాత్య దేశాల్లో ఉపయోగించే ఫైన్ కలపను ఎక్కువగా వాడుతారట.

ఇక అలాంటి ఇల్లు ఎక్కువకాలం మన్నిక రావు అనుకునేవారికి చిన్న క్లారిటీ.

ఇవి సాధారణ ఇండ్లకంటే కూడా ఎక్కువకాలం మన్నిక వస్తాయి.సుమారు 50 ఏళ్ల లైఫ్‌ టైమ్ కలిగి ఉంటుంది అని మేకర్స్ చెబుతున్నారు.

అంతేకాకుండా ఇవి దృఢంగా ఉండటమే కాక తుఫాన్లు, విపరీతమైన శీతల ఉష్ణోగ్రతలు సహా కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు అని అంటున్నారు.వారు భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే సాంకేతికతతో ఇళ్ల నిర్మాణం చేపడతారు.

కాబట్టి మిత్రులారా మీలో ఎవరన్నా ఇల్లు కట్టుకోదలచితే ఇలాంటి ఇల్లు కట్టుకొని పర్యావరణానికి స్నేహితుడిగా మారండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube