మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం నేడు ఫిబ్రవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు విడుదల అయింది.
ఇక ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని( Karthik Gattamneni ) దర్శకత్వం వహించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ సినిమా తెరకేక్కింది.ఇందులో రవితేజకు జోడిగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించారు.
ఇక ఇందులో నవదీప్ అవసరాల శ్రీనివాస్ వంటి తదితరులు కూడా ప్రధాన పాత్రలలో నటించారు.నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే….
కథ:
ఇందులో రవితేజ సహదేవ్ వర్మ అనే పాత్రలో నటిస్తారు.అనుపమ పరమేశ్వరన్ నలిని అనే జర్నలిస్టుగా కనిపిస్తారు.ఓ నేషనల్ ఇంగ్లీష్ పేపర్ లో జర్నలిస్ట్ గా పనిచేసే నళిని ఒకసారి మార్కెట్ కి వెళ్ళగా అక్కడ తలకోనలో లభించే పత్తితో తయారుచేసిన అరుదైన క్లాత్ కనిపించడంతో దాని గురించి ఒక మూలన న్యూస్ రాస్తుంది.ఇక ఈ వార్త పేపర్లో రావడంతో రా, సిబిఐ లాంటి సంస్థలు చూసి నళిని పనిచేసే సంస్థపై దాడి చేస్తాయి.
దీంతో నళిని జాబ్ పోవడంతో అంత చిన్న న్యూస్ రాయడంతో ఇంత పెద్ద వివాదం ఎందుకు చేస్తున్నారన్న ఆలోచనతో నలిని తలకోన వెళుతుంది.తలకోనలో ఒక్కొక్కరిని అడుగుతూ ఆ పత్తి గురించి, ఆ పత్తిని విదేశాల్లో ఫేమస్ చేసిన సహదేవ్ వర్మ(రవితేజ) గురించి తెలుసుకుంటుంది.
ఈ క్రమంలోనే అతను ఒక ఈగల్ అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన కోసం వెతుకుతున్నాయి అనే విషయాన్ని ఈమె తెలుసుకుంటారు.మరో పక్క అక్రమాయుధాల రవాణాలో ఆయుధాలు సరఫరా చేసేవాళ్ళని ఎవరో చంపి ఆ ఆయుధాల్ని మాయం చేయడం, సహదేవ్ వర్మ మీద జరిగిన దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.ఒకప్పుడు ఇలా ఈగల్ గా ఆయుధాలన్నింటిని సరఫరా చేస్తూ ఉన్నటువంటి ఈయన పేరు మార్చుకొని ఒక ఊరిలో పత్తి రైతుగా బ్రతకడానికి కారణం ఏంటి అసలు ఎందుకు ఈ సహదేవ్ గా మారిపోయారు? అతని గతం ఏంటి? అతను గతాన్ని వదిలేసి పత్తి రైతుగా ఎందుకు బతుకుతున్నాడు? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఎప్పటిలాగే రవితేజ హై ఎనర్జీ లెవెల్స్ తోనే ఈ సినిమాలో కూడా నటించారు.ఈ సినిమాలో ఫుల్ హెయిర్ గడ్డంతో ఉన్న లుక్ అందరిని ఆకట్టుకుంది.కావ్య తాపర్ రవితేజ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అందరిని బాగా ఆకట్టుకున్నాయి.
ఇక జర్నలిస్టు పాత్రలో అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) కూడా అద్భుతంగా నటించారు.అవసరాల శ్రీనివాస్ అజయ్ ఘోష్ నవదీప్ వంటి వారందరూ కూడా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
టెక్నికల్:
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ నుంచి దర్శకుడిగా మారడంతో విజువల్స్ మాత్రం చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి.యాక్షన్, ఎలివేషన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది పాటలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని చెప్పాలి.గన్స్, బులెట్స్, కొత్త కొత్త ఆయుధాలతో ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగా చేసారు.కొన్ని సీన్స్ లో మాత్రం ఆర్ట్ డైరెక్టర్ చేసిన ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది ఇక నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్( TG Vishwa Prasad ) ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్రాండ్ వ్యాల్యూ కనిపిస్తోంది.టీజీ విశ్వ ప్రసాద్ పెట్టిన ఖర్చుకు తగ్గ ప్రతిఫలం వచ్చేలా ఉంది.హై రిచ్ కంటెంట్ డెలీవరి చేయడంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి సత్తా చాటింది.
విశ్లేషణ:
ఒక చెడు మార్గంలో ప్రయాణించే హీరో లైఫ్ లోకి ఒక హీరోయిన్ వచ్చి అతన్ని మార్చి ఆమె చనిపోతే ఆమె కోసం ఊరు పేరు మార్చుకొని ఎంతో మంచి వ్యక్తిగా హీరో బ్రతికే కథతో కూడుకున్న సినిమాలు ఇదివరకు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఈ సినిమా కథ కూడా అలాగే ఉంటుంది కానీ యాక్షన్ సన్నివేశాలు సరికొత్తగా ఉండటంతో ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది.అక్రమాయుధాల రవాణా, వాటితో జరిపే కాల్పుల్లో సాధారణ ప్రజలు చనిపోవడం లాంటి అంశాన్ని మాత్రం మొదటిసారి చూపించారు.మొదటి హాఫ్ నలిని సహదేవి గురించి వెతకడం తెలుసుకోవడం సరిపోతుంది సెకండ్ హాఫ్ లో ఆయన గతం చెబుతారు.క్లైమాక్స్ ముందు వచ్చే యాక్షన్ సన్నివేశం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్:
రవితేజ నటన యాక్షన్స్ సన్ని వేషాలు కావ్య రవితేజ మధ్య ప్రేమ సన్నివేశాలు,.
మైనస్ పాయింట్స్
: అక్కడక్కడ కాస్త కన్ఫ్యూజింగ్ సన్నివేశాలు, మ్యూజిక్.
బాటమ్ లైన్:
సినిమా చెడు మార్గంలో ప్రయాణించే ఓ వ్యక్తి భార్య కోసం మంచి మనిషిగా మారి అక్రమాయుధాలు ప్రపంచంలో ఉండకూడదు, ఆయుధం అనేది కాపాడే వాడి చేతిలోనే ఉండాలి కానీ, అర్హత లేని వాళ్ళ చేతిలో ఉండకూడదని మంచి మెసేజ్ ఇచ్చే సినిమా.