వామ్మో.. అది వంకాయ సాంబార్ కాదండోయ్, ఎలుక సాంబార్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సాంబార్ చేస్తుంటారు.ములక్కాడలు, వంకాయలు, ఆలు గడ్డలు, టమాటాలు, దోసకాయలు, సొరయాలు.

 Dead Rat Found In Patients Food In Rinpas Fir Lodged ,  Rat In Patients Food, Ra-TeluguStop.com

ఇలా సవాలక్ష రకాలు వేస్తుంటాం.కానీ ఎక్కడ కనీ వినీ ఎరగని సాంబార్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం.

అదే ఎలుక సాంబార్. ఇదేదో కావాలని తయాపు చేసిన సాంబార్ కాదు లెండి.

సాంబార్ తయారు చేశాక ఎలుక పడడంతో అది ఎలు సాంబార్ అయింది.అయితే ఇదెక్కడో ఇంట్లో, పెళ్లి వంటకాలు చేసే దగ్గరో జరగలేదు.

ఓ ప్రభుత్వాసుపత్రిలో జరిగింది.అది ఝార్ఖండ్ లోని మానసిక రోగులకు చికిత్స అందించే రిన్ పస్ ఆస్పత్రిలో.

Telugu Rat, Rat Sambar-Latest News - Telugu

అయితే రోగులకు అందించే ఆహారంలో ఎలుక వచ్చిన మాట వాస్తవేమేనని.అందుకు కారకులైన వారిని గుర్తించినట్లు ఆస్పత్రి డైరెక్టర్ జయంతి సిమ్లయి తెలిపింది.అంతే కాదండోయ్ అతడిపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపింది.ఆస్పత్రి పేరును చెడగొట్టేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని చెప్పారు.ఈ కేసుతో సంబంధం ఉన్న వారందిరినీ పట్టుకునేందుకు సైబర్ పోలీసులకు కూడా సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా… రిన్ పస్ ఆస్పత్రి మానసిక రోగులకు చికిత్సను అందిస్తోంది.

ఇలాంటి రోగులకు సరైన ఆహారం అందించాల్సి ఉంటుంది.మానసిక రోగులకు అందించే ఆహారంలో చనిపోయిన ఎలుక రావడం పట్ల రోగులు బందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోగుల ఆరోగ్యం పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ… వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube