ఏపిలో ఫ‌లితాలు చూపిస్తున్న ఈ పాస్‌

అంధ్ర‌ప‌దేశ్ ప్ర‌భుత్వం రెండేళ్ల కాలంలో పౌరసరఫరాలశాఖలో చేప‌ట్టిన ఈ-పాస్‌ విధానం క్రమేణా ఫలితాలు చూపిస్తోంది.రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన వినియోగదారులైనా సరకులు పొందేందుకు వీలుగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

 E-pass Successfulll In Ap-TeluguStop.com

తొలుత ఈ విధానంపై కార్డు దారులు, డీలర్లు ఆసక్తి చూపకపోయినా ప్రభుత్వం సాంకేతికపరమైన చిక్కులు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ పట్టుదలతో చేసిన కృషి ఫ‌లించింద‌నే చెప్పాలి.

రాష్ట్రంలో ఎక్కడనుంచైనా తెల్లరేషన్‌ కార్డుదారులు (బీపీఎల్‌) నిత్యావసరసరకులు తీసుకునేందుకు వీలుగా , ఇతర ప్రాంతాలకు చెందిన కార్డుదారులు తమ కార్డులను డీలర్‌ చూపిన వెంటనే ఈ-పాస్‌లో నమోదు చేస్తారు.

కార్డుదారుని చిరునామాతో సహా ఈ-పాస్‌ యంత్రంలో కనిపిస్తుంది.అనంతరం కార్డుదారుని బయోమెట్రిక్‌ ఆధారంగా వేలిముద్రల సేకరించి సరకులు పంపిణీ చేస్తారు.

దీంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వ‌ల‌స‌లు వచ్చిన కార్డుదారులకు సరకులంద‌ట‌మే కాకుండా పంపిణీ వ్య‌వ‌హారం మొత్తం అంత‌ర్జాలంలో ఉండ‌టంతో డీల‌ర్ల దుర్వినియోగం కూడా త‌గ్గుతుంది.

అయితే ఈ విధానంలో సమస్య ఉండక పోయినా, .తుది నిల్వల్లో జ‌రిగే తేడాలు , అధికారుల తనిఖీల సమయంలో ఇబ్బందుల‌కు తావిస్తాయ‌న్న‌ది డీల‌ర్ల ఆందోళన.అయితే ఈ ఆందోళ‌న‌ల‌ను అధికారులు కొట్టి పారేస్తున్నారు.

రాష్ట్రంలో జారీ అయిన కార్డ‌ల‌కు ప్ర‌భుత్వం నిర్టేశించిన స‌రుకులు అందిచే వీలు క‌లుగుతుంద‌ని, దీనిపై ఇంకా అవ‌గాహ‌న క‌లిగిస్తామ‌ని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube